అక్రమ కేసులతో తనను వేధిస్తున్నారని తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది.
చిలకలగూడ పోలీసు స్టేషన్ లో అక్రమంగా నిర్బంధించడాన్ని వ్యతిరేకిస్తూ మల్లన ఈ నెల 6న హైకోర్టును ఆశ్రయించారు. తనను వేధిస్తున్నారని మల్లన్న దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొన్నారు. తనపై వరుసగా అక్రమ కేసులు నమోదు చేస్తూ తన విధులకు ఆటంకం కల్గిస్తున్నారని పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన రెండు రోజులకే విచారణకు హాజరు కావాలని వేధిస్తున్నారని…దర్యాప్తు పేరుతో వేధించడం సరైంది కాదని పిటిషన్ లో పేర్కొన్నారు.ఆన్ లైన్ లో విచారణ జరిపేలా ఆదేశించాలని కోరారు.మల్లన్న తరుపున అడ్వకేట్ ఉమేష్ చంద్ర న్యాయస్థానంలో వాదనలు వినిపించారు. విచారణ అనంతరం రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది .