రాజ్యాధికార సంకల్ప సభ విజయవంతం : BSP సీనియర్ నేత బుర్ర ఉపేంద్ర సాహో

నల్లగొండలో నిర్వహించిన రాజ్యాధికార సంకల్ప సభలో బిఎస్పీ కార్యకర్తలు , అభిమానులు , స్పేరోస్ అనుబంధ సోదరులు పాల్గొని సభను దిగ్విజయం చేశారని అన్నారు బీఎస్పీ ఖమ్మం జిల్లా అద్యక్షులు బుర్ర ఉపేంద్ర సాహో. భవిష్యత్తులో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్ మందా , నూతనంగా రాష్ట్ర కోఆర్డినేటర్ బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ ” ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ సారధ్యంలో BSP పార్టీని బలోపేతం చేసి , బహుజన రాజ్యం స్థాపించడంలో శక్తివంచన లేకుండా నిర్మాణాత్మకంగా పని చేయాలని పిలుపునిచ్చారు. నల్లగొండ సభను విజయవంతం చేయడంలో పనిచేసిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు . ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కర్రి కృష్ణా , జిల్లా ఉపాధ్యక్షులు చెరుకుపల్లి నాగేశ్వరరావు , జిల్లా కార్యదర్శి మిర్యాల నాగరాజు పాల్గొన్నారు .

Load More Related Articles
Load More By admin
Load More In తెలంగాణ

Leave a Reply

Your email address will not be published.