దళిత బంధు గైడ్ లైన్స్-సర్వే అంశాలివే..

దళిత బంధును తెలంగాణాలోని దళితులందరికీ ఇవ్వాలా..? ఇస్తే ఎన్ని నిధులు అవసరం అవుతాయి..?అందుకు సరిపడా బడ్జెట్ ఉందా..? అనే అంశాలపై చర్చిస్తోన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్…దళిత బంధు అర్హత కోసం సర్వే చేపట్టాలని ఆదేశించారు. సర్వే ఆధారంగా లబ్దిదారులను ఎంపిక చేయనున్నారు అధికారులు. అయితే..దళిత బంధుకు అర్హత ఉండాలంటే ప్రభుత్వం ఎలాంటి విధివిధానాలు రూపొందిస్తుందోనని చాలామంది ఆసక్తిగా గమనిస్తున్నారు.

తెలంగాణలోని దళిత కాలనీలో దళిత బంధు కోసం కీలకమైన సర్వే చేపట్టారు అధికారులు. దళిత బంధును పొందేందుకు అర్హత ఉందా..?లేదా అనేది సర్వే నివేదికల ఆధారంగా అధికారులు లబ్దిదారులను ఎంపిక చేయనున్నారు. ఈ సర్వే చాలా సీరియస్ గా చేయాలనీ ఉన్నతాధికారులు కిందిస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దళిత బంధు పొందేందుకు ఎలాంటి గైడ్ లైన్స్ సర్కార్ విడుదల చేయలేదు. దాంతోనే ఈ సర్వే చేస్తున్నట్టు అంచనా వేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమైన ఈ సర్వే…పంచాయితీ కార్యదర్శుల ఆధ్వర్యంలోని బృందం గ్రామాల్లోని దళిత వాడలను విజిట్ చేస్తూ సర్వే చేపడుతోంది.

ఒక్కో ఎస్సీ కుటుంబం నుంచి అధికారులు వివరాలను సేకరిస్తున్నారు. ఇందుకోసం 10 పాయింట్లతో ఓ ఫార్మాట్ ను రూపొందించారు. ఈ ఫార్మాట్ లో కుటుంబం యొక్క ఆర్ధిక పరిస్థితులను అడిగి అందులో ఫిల్ చేస్తారు అధికారులు. కుటుంబానికి పక్కా ఇల్లు ఉందా.. ఎంత జాగ ఉంది.. ఇంట్లో సరాసరి ఆదాయం ఎంత… ఇంట్లో చదువుకున్న వాళ్లు ఉన్నరా.. ఉంటే ఎలాంటి ఉపాధి అవకాశాలు ఉన్నాయి.. ఉద్యోగాలు చేసే కుటుంబాలు ఏమైనా ఉన్నయా.. అనే కోణంలో వ్యక్తిగతంగా సర్వే చేపట్టారు. సొంత ఇల్లు, వ్యవసాయ భూములు, వాహనాలపై వివరాలు తీసుకుంటున్నారు. అయితే…ఈ వ్యక్తిగత సర్వేలో సొంతిల్లు, కారు ఉంటె వారిని అనర్హులుగా గుర్తిస్తారని టాక్ వినిపిస్తోంది. మరో విషయం ఏంటంటే…నియోజకవర్గంలో ఎంత మంది అర్హులు ఉన్న హుజురాబాద్ మినహా…మిగతా నియోజకవర్గాల్లో దళిత బంధు అందించేది మాత్రం వందమందికే. ప్రతిపక్షాలు, దళిత సంఘాలు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరికీ ఈ దళిత బంధు అమలు చేయాలనీ డిమాండ్ చేస్తున్నాయి.

Load More Related Articles
Load More By admin
Load More In తెలంగాణ

Leave a Reply

Your email address will not be published.