భార్య సూసైడ్ చేసుకుంటుంటే వీడియో తీస్తావా..?-సీజేఐ ఆగ్రహం

సుప్రీం కోర్టులో ఓ కేసు విచారణలో భాగంగా సీజేఐ ఎన్వీ రమణ నిందితుడిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భార్యను కంటికి రెప్పలా కాపాడాల్సింది పోయి…భార్య ఆత్మహత్య చేసుకుంటుంటే ఆపాల్సిందిపోయి వీడియో తీస్తావా అంటూ చీవాట్లు పెట్టారు.

అతను సైనికుడు.. రాజస్థాన్ లోని అల్వార్ కు చెందిన సాహాబుద్దీన్. భార్య సూసైడ్ కేసులో అభియోగాలను ఎదుర్కొంటున్నాడు. ఈ కేసు విచారణను చేపట్టిన అతనికి అక్కడి హైకోర్టు బెయిల్ నిరాకరించింది. దీంతో బెయిల్ కోసం సుప్రీంను ఆశ్రయించాడు సాహాబుద్దీన్. కాని అక్కడ అతనికి మంచీ చీవట్లే ఎదురయ్యాయి. ఈ బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్ ల ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా సీజేఐ రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాకుండా.. భార్య ఆత్మహత్య చేసుకుంటుంటే ఆపకుండా వీడియో తీస్తావా? అంటూ మండిపడ్డారు. స్వయానా నిందితుడి కూతురు వాంగ్మూలమూ మహిళ ఆత్మహత్యకు అతడే కారణమని చెబుతోందని, కీలక సాక్షులు, నిందితుల వాంగ్మూలాలను సేకరించే వరకు బెయిల్ ను ఇవ్వబోమని తేల్చి చెప్పారు. ఇక, తన న్యాయవాద జీవితంలో ఇలాంటి చార్జిషీటును తానెన్నడూ చూడలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. పోలీసుల దర్యాప్తు తీరుపై అనుమానం వ్యక్తం చేశారు. కేసును స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాల్సిందిగా రాజస్థాన్ ప్రభుత్వానికి సూచించారు.

Load More Related Articles
Load More By admin
Load More In క్రైమ్

Leave a Reply

Your email address will not be published.