ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును సీనియర్ జర్నలిస్టు పాలగుమ్మి సాయినాథ్ తిరస్కరించిన విషయం మరవకముందే మరో జర్నలిస్ట్ తెలకపల్లి రవి కూడా అదే నిర్ణయం తీసుకున్నారు.
ఇటీవల ఏపీ ప్రభుత్వం వివిధ రంగాలకు చెందిన సంస్థలు, ప్రతిభ కనబర్చిన వ్యక్తులు, కళాకారులకు వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్, అచీవ్మెంట్ పురస్కారాలను ప్రకటించింది. ఇందులో భాగంగా సీనియర్ జర్నలిస్ట్ తెలకపల్లి రవికి వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ప్రకటించింది జగన్ సర్కార్. కాని ఈ అవార్డును తిరస్కరించారు ఆయన. ప్రస్తుతం ఉన్న వివాదాస్పద రాజకీయ మీడియా, సామాజిక మాధ్యమాల వాతావరణంలో ఈ అవార్డును స్వీకరిండం లేదని ఆయన తెలిపారు. తనకు ఈ అవార్డు ప్రకటించినందుకు ఏపీ సర్కార్ కు తెలకపల్లి రవి కృతజ్ఞతలు తెలిపారు.