ఆలేరు సీటుపై కన్నేసిన మోత్కుపల్లి-మరీ గొంగిడి సునీత..?

స్వామి కార్యం చేస్తూనే, స్వకార్యం పూర్తి చేసుకునే పనిలో ఉన్నారు మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు. ఒకప్పుడు కేసీఆర్ ను తిట్టిన తిట్టు తిట్టని ఆయ‌న‌…ప్రగ‌తి భ‌వ‌న్‌కు పిలుపు వ‌చ్చిన‌ప్పటి పూర్తిగా తన స్టైల్ ను మార్చేశారు. ఇప్పుడు కేసీఆర్ ను ప్రశంసలతో ఆకాశానికెత్తారు. దీంతో మాట్లాడేది మోత్కుపల్లెనా అని అంత ఆశ్చర్యపోతున్నారు. అయితే దీని వెనక లోగొట్టు మరొకటి ఉందనే విశ్లేషనలు వినిపిస్తున్నాయి.

ఆల్ ఆఫ్ సడెన్ గా మోత్కుపల్లి మారిపోయారు.పూర్తిగా మారిపోయారు. ఒకప్పుడు కేసీఆర్ పై ఒంటి కాలిపై లేచే ఆయన ఇప్పుడు భక్తుడిగా మారిపోయాడు. అభినవ అంబేద్కర్ అంటూ కేసీఆర్ ను కీర్తిస్తున్నారు. స్వామికార్యం కోసం కేసీఆర్ ను ఆకాశానికెత్తేస్తోన్న మోత్కుపల్లి…ఇప్పుడు స్వకార్యం నెరవేర్చుకునే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన మనస్సు ఆలేరు నియోజకవర్గంపై గుంజుతున్నట్లు తెలుస్తోంది.

వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పొటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ఆయన మాటలను బట్టి తెలుస్తోంది. త‌న ఆలేరు నియోజకవర్గంలో దళిత బంధు పథకాన్ని కేసీఆర్ ప్రారంభించడం సంతోషమంటూ ప‌రోక్షంగా మోత్కుప‌ల్లి త‌న అభిలాష‌ను వ్యక్తప‌రిచారు. చూస్తోంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆలేరు నుంచి టీఆర్ఎస్ టికెట్ తీసుకోవాల‌నే ఆశ మోత్కుప‌ల్లిలో స్పష్టంగా క‌నిపిస్తోంది. టీఆర్ఎస్ లో చేరి…ఆలేరు టికెట్ ను వచ్చే ఎన్నికల్లో తనకు కేటాయించాలని కోరనున్నారు మోత్కుపల్లి. అదే జరిగితే గొంగిడి సునీతను ఏమి చెప్పి నచ్చ జేపుతారో చూడాలి

Load More Related Articles
Load More By admin
Load More In తెలంగాణ

Leave a Reply

Your email address will not be published.