తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు పెను ప్రమాదం తప్పింది. తొర్రూర్ లో కార్యక్రమాలు ముగించుకుని జనగామ వైపు కాన్వాయ్ లో మంత్రి వెళ్తుండగా…అదే దారిలో ట్రాక్టర్ పైనుంచి పడిపోయిన కేజీవీల్ ఎర్రబెల్లి వాహనం వైపు దూసుకొచ్చింది.

దీంతో మంత్రి కాన్వాయ్ డ్యామేజ్ అయింది. కొడకండ్ల మండలం వెలిశాల-కొడకండ్ల మద్య ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో మంత్రికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంత ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం మరో వాహనంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు.