మరోసారి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ హైకోర్టు ఆగ్రహానికి గురయ్యారు. కోర్టు ధిక్కరణ కేసు విచారణలో భాగంగా వివరణ ఇచ్చేందుకు సోమేశ్ కుమార్ గురువారం కోర్టుకు హాజరు అయ్యారు. ఈ సందర్భంగా తన తప్పును కప్పి పుచ్చుకునేందుకు ప్రయత్నించి మరోసారి హైకోర్టు ఆగ్రహానికి లోనయ్యారు.

కోర్టు ధిక్కరణ కేసుల విచారణ కోసం ప్రభుత్వం కేటాయించిన 58కోట్లు తన కోసం కాదని సోమేశ్ కుమార్ కోర్టుకు వివరించే ప్రయత్నం చేశారు. పిటిషనర్ కోర్టును తప్పుదోవ పట్టించారని పేర్కొన్నాడు సోమేశ్ కుమార్. విచారణ జరుగుతున్న సమయంలో వాస్తవాలను కోర్టుకు సమర్పించలేకపోయామని చెప్పుకొచ్చారు. ఇక, నిధులు విడుదల చేయవద్దన్న మధ్యంతర ఉతర్వులను ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు.

కోర్టు ధిక్కరణ కేసుల విచారణ కోసం కేటాయించిన రూ. 58 కోట్లకు సంబంధించిన జీవో, అలాగే సీఎస్ వివరణ వేర్వేరుగా ఉండటాన్ని హైకోర్టు గుర్తించింది. మీరు చెప్తున్నా డానికి …జీవో పేపర్లపై ఉన్న దానికి ఏమైనా సంబంధం ఉందా అని హైకోర్టు నిలదీసింది. ఇది అంత కోర్టు ధిక్కరణ కేసుల విచారణ కోసం అన్నట్టుగానే జీవో కనిపిస్తోందని అభిప్రాయపడింది.