కేసీఆర్ ను నేల మీదకు దింపిన ఈటల

హుజురాబాద్ ఉప ఎన్నిక టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దుబ్బాక ఓటమితో చేతులు కాల్చుకున్న కేసీఆర్ … హుజురాబాద్ లో మాత్రం అ పరిస్థితి రానివద్దని కష్టపడుతున్నారు. ఈ ఎన్నికను ఏమాత్రం ఆషామాషీగా తీసుకున్న టీఆర్ఎస్ ఎదుగుదలకే ఇబ్బందులు వస్తాయనే విశ్లేషణలు వినిపిస్తున్నా దృష్ట్యా…కేసీఆర్ హుజురాబాద్ బైపోల్ ను సీరియస్ గా తీసుకున్నారు. ఈసారికి మాత్రం ఎవర్నీ నమ్మకుండా ఆయనే రంగంలోకి దిగీ మారీ ఓ రకంగా ప్రచారం మొదలెట్టేశారు.

హుజురాబాద్ ఉప ఎన్నిక ముగిసే వరకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజల్లోనే ఉండాలని నిర్ణయిచుకున్నారు. హుజురాబాద్ లో ఏమాత్రం తేడా వచ్చినా…పార్టీ నుంచి వలసలు మొదలవ్వడంతో పాటు, తాళాలు పడిన ఎన్నో నోళ్ళు తమ వాయిస్ ను వినిపిస్తాయనే ఆందోళనలో ఉన్నారు గులాబీ శ్రేణులు. ఎంత మంది నేత‌ల‌ని గ్రౌండ్‌లోకి దింపినా కేసీఆర్ కు న‌మ్మకం కుదురుతున్నట్టుగా లేదు. ట్రబుల్ షూట‌ర్ హ‌రీష్‌రావు కూడా దుబ్బాక‌లో ఉత్త చేతుల‌తో తిరిగిరావ‌డంతో.. ఈసారి ఆ అవ‌కాశం ఇవ్వద‌లుచుకోలేదు.

దీంతో తానే స్వయంగా రంగంలోకి దిగుతున్నారు కేసీఆర్. హుజురాబాద్ బైపోల్ ముగిసే సరికి మూడు బహిరంగ సభలు నిర్వహించాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని టీఆర్ఎస్ లో చర్చ జరుగుతోంది. ఈ నెల 16న దళిత బంధు ప్రారంభోత్సవం రోజున మొదటి సమావేశం నిర్వహిస్తారు. ఉప ఎన్నిక నోటిఫికేషన్ జారీ చేసిన తరువాత రెండో సభను నిర్వహించాలని అనుకుంటున్నారు. ఇక ఫైనల్ గా…పోలింగ్ కు మూడు, నాలుగు రోజుల ముందు మూడో సభను నిర్వహిస్తారని తెలుస్తోంది. కేసీఆర్ ఇదివరకు ఎ ఉప ఎన్నిక కోసం ఇంతలా కష్టపడలేదు. మూడు సభల్లో పాల్గోననేలేదు. మొదటిసారిగా హుజురాబాద్ బైపోల్ కోసం కేసీఆర్ మూడు సభల్లో పాల్గొనాల్సి వస్తోంది.

Load More Related Articles
Load More By admin
Load More In తెలంగాణ

Leave a Reply

Your email address will not be published.