ఎట్టెట్టా..ఉద్యమ’కారు’లకెమో అవమానాలు-ద్రోహులకు పదవులా..?

సిఎం కేసీఆర్ పై మాజీ మంత్రి , బీజేపీ నేత ఈటల రాజేందర్ మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఈటల…సిఎం కేసీఆర్ కుట్ర రాజకీయాలను ప్రజలు అర్థం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన జగన్ ఓదార్పు యాత్రను సపోర్ట్ చేసిన వ్యక్తి, ఉద్యమకారులపై రాళ్ళ దాడి చేసిన వ్యక్తికి ఎమ్మెల్సీ కట్టేబట్టారని విమర్శించారు. టీఆర్ఎస్ బాస్ రాజకీయాలను తెలంగాణ ప్రజానీకం ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని సూచించారు. కేసీఆర్ ప్రజలను నమ్మకుండా కేవలం పైసలనే నమ్ముతాడని…హుజురాబాద్ ఇప్పటికే 150 కోట్ల నగదు పంపిణీ చేశారని ఆరోపించారు ఈటల. దళితులకు ఇదివరకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా…ఇప్పుడు కొత్తగా దళిత బంధుతో కొత్త నాటకానికి తెర తీశారని మండిపడ్డారు.

Load More Related Articles
Load More By admin
Load More In తెలంగాణ

Leave a Reply

Your email address will not be published.