టీఆర్ఎస్ లో అలా చేరగానే…ఇలా కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టడం పట్ల హుజురాబాద్ టీఆర్ఎస్ నేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. వచ్చి రెండు వారాలు కూడా గడవకముందే…కేసీఆర్ ఆయన్ను ఇలా గౌరవించడం ఏంటని…పార్టీ కోసం దశాబ్దాలుగా పని చేస్తున్న తమకు న్యాయం చేయడం లేదని కుతకుతలాడిపోతున్నారు. దీంతో కౌశిక్ పేరు ఎత్తితేనే హుజురాబాద్ టీఆర్ఎస్ సీనియర్లు అసహనం వ్యక్తం చేస్తునట్టు తెలుస్తోంది.
టీఆర్ఎస్ లో అలా చేరాడో లేదో ఎమ్మెల్సీ పదవిని ఎగరేసుకుపోయాడు కౌశిక్ రెడ్డి. కాని తాము మాత్రం దశాబ్ద కాలంగా పార్టీ కోసం పని చేస్తోన్న ఇప్పటికీ పదవులు దక్కడం లేదని హుజురాబాద్ టీఆర్ఎస్ సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీ కోసం పని చేసినా వారి కన్నా…అవతలి పార్టీ నుంచి వచ్చిన నేతలకే టీఆర్ఎస్ లో అధిక ప్రాధాన్యత దక్కుతుందని అక్కడి నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. కేసీఆర్ కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టినా ఆయనను మాత్రం నెత్తిన మోయాల్సిన అవసరం లేదని సీనియర్లంతా ఓ నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తోంది. కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ దక్కడంపై హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన ఓటీఆర్ఎస్ నేత ఇంట్లో పార్టీ సీనియర్లు సమావేశం అయ్యారని తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరి…పార్టీ కోసం ఇంకా రంగంలోకి దిగనే లేదు..అప్పుడే ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టడం ఏంటని కేసీఆర్ వైఖరిపై అసంతృప్తి చేసినట్టు సమాచారం.