ఈ నెలలోనే థర్డ్ వేవ్-పీక్స్ లోకి అప్పుడేనట

ముందుగా వేసిన అంచనాలే నిజం అవుతున్నాయి. ఆగస్ట్ లోనే థర్డ్ వేవ్ ప్రారంభమై…అక్టోబర్ నాటికీ పీక్ స్టేజ్ కు వెళ్ళే అవకాశం కనిపిస్తోందని బ్లూమ్ బర్గ్ తెలిపింది. హైదరాబాద్ , కాన్పూర్ ఐఐటీ ప్రొఫెసర్లు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాజాగా మిచిగాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ భ్రమర్ ముఖర్జీ కూడా ఆగస్ట్ లో థర్డ్ వేవ్ ప్రారంభం అవుతుందని చెప్పుకొచ్చారు. భారత్ లో అక్టోబర్-నవంబర్ నాటికీ గరిష్ట స్థాయికి చేరుతుందని పేర్కొన్నారు.

భారత్ లో ప్రస్తుతం నమోదు అవుతున్న కేసులను బేస్ చేసుకొని వైరస్ వ్యాప్తిపై భ్రమర్ బృందం ఈ అంచనాకు వచ్చింది. ఫిబ్రవరిలో సెకండ్ వేవ్ ను తాము ముందే ఊహించామని…ఇప్పుడు థర్డ్ వేవ్ నవంబర్ నాటికీ ఉదృతంగా ఉంటుందని హెచ్చరించింది. కొంత ఊరట కల్గించే విషయం ఏంటంటే…ఈ థర్డ్ వేవ్ చిన్న పిల్లలపై ప్రభావం చూపుతుందనే విషయాన్నీ కొట్టివేసింది భ్రమర్ టీం. ఇక, భారత్ ఐఐటీ ప్రొఫెసర్ల అంచనా ప్రకారం అక్టోబర్ నాటికీ దేశంలో కోవిడ్ వ్యాప్తి అధికంగా ఉంటుందని పేర్కొంది. అయితే థర్డ్ వేవ్ లో కోవిడ్ తీవ్రత తక్కువగానే ఉండే అవకాశం ఉండొచ్చని అంచనా వేసింది.

Load More Related Articles
Load More By admin
Load More In ఆంధ్రప్రదేశ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *