హుజురాబాద్ ఉప ఎన్నిక టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరన్న దానిపై క్లారిటీ వచ్చేసింది. పార్టీ అధినేత, సిఎం కేసీఆర్ అధికారిక ప్రకటన చేయకపోయినా…ప్రస్తుత పరిణామాలను చూస్తె బీసీ నేతనే బరిలో నిలపాలని కేసీఆర్ ఆలోచనగా కనిపిస్తోంది. ఇప్పటికే కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా నియమించిననందున ఆ సామజిక వర్గానికి టికెట్ దక్కే అవకాశం అయితే లేదు. సో..బీసీ సామజిక వర్గానికి చెందిన నేతనే బరిలో నిలపాలని కేసీఆర్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టినా సిఎం కేసీఆర్…హుజురాబాద్ బైపోల్ అభ్యర్థిగా రెడ్డిని బరిలో దింపే అవకాశం అయితే లేదు. ఈ పరిణామంతో ఇటీవల టీఆర్ఎస్ లో చేరినా పెద్దిరెడ్డి, కశ్యప్ రెడ్డి వంటి వారు హుజురాబాద్ ఉప ఎన్నిక అభ్యర్తుల రేసులో లేరని కేసీఆర్ పరోక్షంగా చెప్పకనే చెప్పారు. బహుజన వాదాన్ని బలంగా వినిపిస్తోన్న ఈటలను ఎదుర్కోవాలంటే… బీసీనే వారిలో నిలపాలని అనుకుంటున్నారు కేసీఆర్. ఎల్ రమణ ఇటీవల పార్టీలో చేరిన సమయంలో హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి ఆయనే ప్రచారం జరిగినా..స్థానికేతరుడు అనే కారణంతో ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశం లేదు. ఇక, స్వర్గం రవి, అరికాల వీరేశలింగం పొనుగంటి మల్లయ్యలు ఆశావహులుగా ఉన్నప్పటికీ…వారు కాకుండా టీఆర్ఎస్వీ అద్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును కేసీఆర్ పరిశీలిస్తున్నట్టుగా కనిపిస్తోంది. టీఆర్ఎస్ అనుకూల పత్రికలో గెల్లును హైలేట్ చేస్తూ కథనాన్ని ప్రచురించడం ఇందుకు బలం చేకూరుస్తోంది. దీంతో పరోక్షంగా కేసీఆర్ ముందుగానే ఓ ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. మరో వైపు గెల్లుపై సదరు పత్రిక ప్రశంసల జల్లు కురిపించింది.

టీడీపీ అధికారంలో ఉన్నప్పటి నుంచి విద్యార్థుల సమస్యలపై గెల్లు శ్రీనివాస్ పోరాటం చేశారని, విద్యార్ధి విభాగం అద్యక్షుడిగా పార్టీ కోసం కష్టపడ్డారని పత్రికలో పేర్కొన్నారు. అలాగే 610జీవోపై గెల్లు విద్యార్థులను సమీకృతం చేసి పోరాటం చేశారని పత్రికలో ప్రస్తావించింది. తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్న సమయంలో నాటి ముఖ్యమంత్రులు చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డిలను వివిధ పర్యటనలో గెల్లు అడ్డుకున్నారని పేర్కొంది. దీంతో హుజురాబాద్ బైపోల్ టీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ దాదాపు గెల్లు పేరును ఫిక్స్ చేశారని…అందుకే ఆయనను ప్రశంసిస్తూ అనుకూల పత్రిక ఈ కథనం రాసినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
