మాజీమంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజురాబాద్ నియోజకవర్గం దిశాదిశ మారుతోంది. ఈ నియోజకవర్గంపై కేసీఆర్ ప్రత్యేక ప్రేమను కనబరుస్తున్నారు. అడిగిన వారికీ, అడగని వారికీ వరాల జల్లు కురిపిస్తున్నారు. ఈటల రాజీనామా చేయడం నిజంగా హుజురాబాద్ ప్రజల తలరాతను మరోస్తోంది.

హుజురాబాద్ పై ప్రత్యేకమైన ప్రేమను చూపిస్తున్నారు సిఎం కేసీఆర్. అక్కడ గెలుపు కోసం ఆయన వరాల జల్లు కురిపిస్తున్నారు. ఇంకో పదేళ్ళు గడిచినా జరగని అభివృద్ధి హుజురాబాద్ లో రెక్కలు కట్టుకొని వాలిపోతోంది. దీంతో హుజురాబాద్ కు ఈటల ఎం చేశారని ప్రశ్నిస్తోన్న వారికీ ఆయన అభిమానులు, బీజేపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో సమాధానం చెప్తున్నారు. మంత్రిగా అందరూ మంత్రులు చేసిన దానికంటే ఎక్కువ చేశారని…ఇప్పుడు హుజురాబాద్ పై కురుస్తోన్న వరాల జల్లుకు ఈటల కారణమని కౌంటర్ లు ఇస్తున్నారు. ఒకవేళ ఈటల రాజీనామా చేయకపోతే ఈ అభివృద్ధి పనులు జరిగేవా..?దళిత బంధు పుట్టుకోచ్చేదా అని టీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగాన్ని డైలమాలో పడేలా కౌంటర్లు ఇస్తున్నారు. హుజురాబాద్ లో ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు, 50 వేల రైతు రుణమాఫీ ప్రకటన, హుజురాబాద్‌కే కొత్తగా రేషన్ కార్డులు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి హుజురాబాద్‌కు ఇవ్వడం వంటివి ఈటల రాజీనామా చేయడం ద్వారానే సాధ్యం అయిందని పేర్కొంటున్నారు. దీంతో మీరు సూపరహే అంటూ ఈటలపై నెటిజన్లు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.