చరిత్రను మరునపడేశారు పాలకులు. అసలు సత్యాలను ప్రపంచానికి తెలియకుండా దాచేందుకు ఎన్నో ప్రయత్నాలను చేశారు. రిజర్వ్ బ్యాంక్ స్థాపనకు ప్రధాన కారణమైన డాక్టర్ అంబేడ్కర్ కృషిని, జ్ఞానాన్ని తెలియజేస్తే ఈ దేశ దళితులకు ఇంత జ్ఞాన సముపార్జన ఉందా..?అనే మెసేజ్ జనాల్లోకి వెళ్తుందనుకున్నారు నాటి పాలకులు. అంబేద్కర్ కృషిని మరుగన పడేసిన నాటి పాలకుల వారసత్వాన్ని నేటి పాలకులు కూడా దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. ఈవాళ మనం చదువుతున్న చరిత్ర వెనక కనిపించని మరో చరిత్ర ఉంది. మనం అనుభవించే స్వేఛ్చ వెనక ఎంతోమంది మరుగున పడిన మేధావుల కృషి ఉంది. కాని అందులో కొంతమంది కృషి మాత్రమే రికార్డ్ అయింది. మిగతా వారిని మరుగన పడేశారు.
భారత ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్నా వ్యవస్థ… రిజర్వు బ్యాంక్ అఫ్ ఇండియాకు పునాదులు వేసిన మేధావి ఎవరో విద్యార్ధి దశ నుంచి యూనివర్సిటీ స్థాయికి వచ్చే వరకు ఎక్కడా బోదించరు. ఎక్కడో మనం అంబేద్కర్ కు సంబంధించిన బుక్స్ లో చదివి ఉంటాం. తప్పితే మరో చోట అంబేద్కర్ గురించి ఎవరూ చెప్పరు. ఈ దేశంలోని దళితులకు జ్ఞానం లేదని అవహేళన చేస్తున్న వేళ…ఉన్నత విద్యను అభ్యసించి ఈ దేశ చరిత్రపై నుదిటి సంతకమై నిలిచాడు డాక్టర్ అంబేద్కర్. ఏకంగా రిజర్వ్ బ్యాంక్ వ్యవస్థాపనకు కారణం అయ్యాడు. 1922లో అంబేద్కర్ డాక్టరేట్ తీసుకొవడానికి రాసిన థీసీస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటుకు దారి తీసింది. the problem of the rupee its origin and its solution అనే పరిశోధన గ్రంథంలో అన్నింటిని సవివరంగా పేర్కొన్నాడు. ఆయన ఆ థీసీస్ లో పొందుపరచిన అంశాల ఆధారంగానే రిజర్వ్ బ్యాంక్ విధి విధానాలు రూపొందించారు. రిజర్వ్ బ్యాంక్ ఎలా ఉండాలి..?ఎలా ఉంటే బాగుంటుంది..?ఆర్ధిక వ్యవస్థ బలోపేతం వంటి అంశాల గురించి తన పరిశోధన గ్రంథంలో క్షుణ్ణంగా పేర్కొన్నాడు డాక్టర్ అంబేద్కర్.

అప్పుడు అంబేద్కర్ రాసిన ఈ పరిశోధన గ్రంథంతో ప్రపంచ దేశాలు సైతం ఆయన తెలివిని చూసి ఆశ్చర్యపోయాయి. మా దేశంలో ఇలాంటి వ్యక్తులు ఉండి ఉంటె బాగుండేదని అంబేద్కర్ జ్ఞాన సముపార్జనను చూసి సంబర పడ్డాయి. కాని మన దేశం మాత్రం ఆయన తెలివిని కులం కార్డు పెట్టి అణచివేసింది. ఇక్కడే అంబేద్కర్ తాను సాధించాల్సిన విజయాన్ని సాధించాడు. దళితులకు తెలివే ఉండదని ప్రచారం చేసిన ఎన్నో గొంతులను ఈ పరిశోధన గ్రంథంతో నోళ్ళు మూయించాడు. మొత్తం భారత ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్నా వ్యవస్థ రిజర్వు బ్యాంక్ అఫ్ ఇండియా. ఇలాంటి వ్యవస్థకు పునాదులు వేసిన వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్. కాని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రించే నోట్లపై అంబేద్కర్ బొమ్మను వేయకుండా…గాంధీజీ బొమ్మను అచ్చు వేసి అసలు చరిత్రను సమాధి చేసే ప్రయత్నం చేశారు. గాంధీజీ స్వాతంత్ర్య సమరయోదుడే కావొచ్చు కాని…రిజర్వ్ బ్యాంక్ గురించి ఏమాత్రం విశ్లేషణ చేయని , దానితో అసలు సంబంధమే లేని గాంధీజీ ఫోటోను కరెన్సీ నోట్లపై ముద్రించడం అనేది చరిత్రకు వక్ర భాష్యం చెప్పడమే అవుతుంది.

అలాగే…ఉద్యోగం చేసే ప్రతి ఉద్యోగికి అన్ని విధాలా భద్రత ఉండాలని పరితపించిన వ్యక్తి అంబేద్కర్. అందుకే ఈఎస్ఐ వ్యవస్థను కూడా అంబేద్కరే తీసుకొచ్చారు. అయినా విషయాలను ఎవరూ ఎక్కడ చెప్పరు…ఒక్కొక్క నిజం బయటకు వస్తున్నా వేళ…చరిత్ర అంత వక్రీకరణల పర్వమే అనిపిస్తోంది ఒక్కోసారి. వేతన సవరణ చట్టం, ఉద్యోగ భీమా కల్పించిన మేధావి అంబేద్కర్. అలాగే ఉద్యోగ సంఘాల్లో పని చేసే ఉద్యోగులకు యాజమాన్యంతో ఏదైనా ఇబ్బంది వస్తే ఒంటరిగా ఉంటె వేధింపులు ఉంటాయని…సంఘాలు ఉండాలని ఆలోచన చేసిన వ్యక్తి కూడా ఆయనే. భవిష్యత్ లో రానున్న ఇబ్బందులను చాలా దూరదృష్టితో అంచనా వేసి…ముందస్తు చర్యలకు ఉపక్రమించిన భవిష్యత్ దర్శనీకుడు అంబేద్కర్. కాని చరిత్ర అంబేద్కర్ ను విస్మరించింది.
