హుజురాబాద్ బైపోల్ గెలుపు, ఓటమి టీఆర్ఎస్ భవితవ్యాన్ని నిర్దేశించేదిలా మారింది. అందుకే ఈ ఉప ఎన్నికను టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈటలను అన్యాయంగా కేసీఆర్ బలి పశువు చేశారని ప్రజల్లో సానుభూతి తోడవ్వటం…మంత్రులు, ఎమ్మెల్యేలు అంత మంద మందగా ఈటలపై మాటల దాడి చేయడంతో ఆయనపై మరింత సానుభూతి పెరిగేలా చేసింది. ఒకప్పుడు టీఆర్ఎస్ ను నడిపించిన నాయకుడిగా ఉన్న ఈటలను ఇప్పుడు ఉద్యమ ద్రోహులను పక్కన బెట్టుకొని విమర్శలు చేస్తున్నారనే మెసేజ్ ప్రజల్లోకి వెళ్ళింది. దీంతో రోజురోజుకు ఈటలపై మరింత సానుభూతి వ్యక్తం అయింది. పైగా డబ్బులు, పదవులు ఎరవేసి ఈటల వెంట ఉన్న నాయకులను పార్టీలో చేర్చుకోవడంతో టీఆర్ఎస్ పై మరింత వ్యతిరేకత వ్యక్తం అవుతూ వచ్చింది. ఎం చేసినా అది టీఆర్ఎస్ కు ప్రతికూలంగా మారుతుందని భావించిన కేసీఆర్…హుజురాబాద్ సెగ్మెంట్ లో అత్యధిక జనాభా ఉన్న దళిత సామజిక వర్గాన్ని టీఆర్ఎస్ వైపు ఆకర్షితుల్ని చేసేలా దళిత బందును తీసుకొచ్చారు. దీని గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నా …హుజురాబాద్ లో మాత్రం ఆశించిన ఫలితం వచ్చే అవకాశం మాత్రం లేనట్లే కనిపిస్తోంది.

రేషన్ కార్డులు, మున్సిపాలిటీలకు నిధులు, దళిత బంధు వంటివి ఈటల రాజీనామా వలెనే అనే మెసేజ్ జనాల్లోకి వెళ్ళినట్లు కనిపిస్తోంది. దళిత బంధు వారి అభ్యున్నతి కోసమేననే చెబుతున్నా…ఇదివరకు గుర్తుకురాని దళితుల సాధికారత ఈటల రాజీనామా చేసినా తరువాతే గుర్తుకు వచ్చిందా..అని దళిత సంఘాలు టీఆర్ఎస్ సర్కార్ ను నిలదీస్తున్నాయి. ఈటల ఇష్యూ తరువాతే రేషన్ కార్డులు ఇవ్వాలని గుర్తుకు వచ్చాయా అని ప్రశ్నిస్తున్నాయి. దళితులను ఈటల నుంచి దూరం చేయాలని ఎంత ట్రై చేస్తున్నా టీఆర్ఎస్ ఆశించిన ప్రయోజనం మాత్రం దక్కడం లేదనే ఆలోచనలో టీఆర్ఎస్ శ్రేణులు ఉన్నట్లు కనిపిస్తోంది. పైగా ఈటలను బద్నాం చేసేందుకు ఎంత ట్రై చేసినా…అది రివర్స్ ఈటలకే అనుకూలంగా మారుతున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఆయా నియోజకవర్గాల్లో ప్రజలంతా అభివృద్ధి కావాలంటే ఉప ఎన్నికలు రావాలని కోరుకుంటున్నారని…అందుకే ఎమ్మెల్యేల రాజీనామాలకు డిమాండ్ చేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు.