అక్కడ ఆకలి బాధలు కలిచివేస్తున్నాయ్

కరోనా మహమ్మారి అందరి జీవితాలను తలకిందులు చేసింది. ఇప్పటికీ చేస్తుంది కూడా. కోవిడ్ వలన ఎంతోమంది ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతుంటే..పేద దేశాలకు చెందిన ఎంతోమంది ఆకలితో అలమటిస్తున్నారు. ధనిక దేశాల సహాయం కోసం పేద దేశాలకు చెందిన ప్రభుత్వాలు ఆశగా ఎదురు చూస్తున్నాయి.ప్రజల జీననోపాధిపై దాడి చేసినా కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఆకలితో అలమటించే వారి సంఖ్యా మూడింట ఓ వంతుకు పెరిగిందని అగ్రరాజ్యం అగ్రికల్చర్ విభాగం స్పష్టం చేసింది.

ఆహర భద్రతకు సంబంధించిన నివేదికను అగ్రరాజ్యం అగ్రికల్చర్ విభాగం యూఎస్‌డీఏ విడుదల చేసింది. తాజాగా 76 మధ్య, స్వల్పాదాయ దేశాల వార్షిక అంచనా-2021ను రిలీజ్ చేసింది యూఎస్‌డీఏ. పోయిన ఏడాది నుంచి ఈ దేశాల్లో 291 మిలియన్ల మందికి అదనంగా ఆహార కొరత ఏర్పడిందని అంచనాకు వచ్చింది. పోయిన ఏడాది ప్రపంచ ఆహార కొరత సమస్య 15 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా తారాస్థాయికి చేరుకుందని యూఎన్ఓ పేర్కొంది. ప్రపంచ జనాభాలో పదవ వంతు మంది ఆరోగ్యకరమైన ఆహరం తీసుకోవడం లేదని ఐక్యరాజ్య సమితి తెలిపింది. ఆందోళన కరమైన విషయం ఏంటంటే…ఆహార ధాన్యాల దిగుమతులపై ఆధారపడిన పేద దేశాల పరిస్థితులు ఈ ఏడాదిలో మరే దిగజారే అవకాశం ఉందని అగ్రరాజ్యం అగ్రికల్చర్ విభాగం పేర్కొంది. ఈ ఏడాది 31 శాతం జనాభా ఆహార అభద్రతకు గురి కానున్నారు.

ఆకలి బాధల అనాధలెందరో

జింబాబ్వే,యెమెన్, కాంగో లాంటి దేశాల్లో అధిక శాతం జనాభా ఆకలితో అలమటిస్తోంది. ఈ దేశాల్లో 80 శాతం పైగా జనాభాకు సరిపడా ఆహరమే లేదు. అక్కడి ప్రాంత వాసులు ఆర్దాకలితో ఇబ్బందులు పడుతున్నారు.అయితే వీటన్నింటికి కారణాన్ని యూఎస్‌డీఏ తన నివేదికలో పేర్కొంది నిరంతర ఆదాయాల తగ్గుదలే ఈ ఆహార అభద్రతకు ప్రధాన కారణమని పేర్కొంది.

These are the world's 10 hungriest countries in 2020
Load More Related Articles
Load More By admin
Load More In నేషనల్

Leave a Reply

Your email address will not be published.