తీన్మార్ మల్లన్నపై సంచలన ఆరోపణలు

తీన్మార్ మల్లన్నపై ఆయన టీం సభ్యులు సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల నుంచి మల్లన్న ఇప్పటికీ 200 కోట్లు వసూళ్లు చేశాడని ఆరోపించారు. ఈటల రాజీనామాకు ప్రధాన కారణం తీన్మార్ మల్లన్నేనని…ఈ ఉప ఎన్నికల్లో ఆయనను కూలంగా పని చేసేందుకు డీల్ కుదుర్చుకున్నాడని ఆరోపించారు. ఆయన నిర్వహిస్తోన్న క్యూ న్యూస్ లో రోజు సెటిల్మెంట్లు జరుగుతాయన్న మల్లన్న టీం సభ్యులు చిలుక ప్రవీణ్, అశోక్…మల్లన్నను నమ్మి మోసపోవద్దనే ఈ విషయాన్నీ తెలియజేస్తున్నామని ప్రకటించారు. ఈ విషయాన్నీ బయట పెట్టినందుకు మాపై దాడులు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మల్లన్న బాగోతం త్వరలోనే బయట పెడతామని Q news సోషల్ మీడియా కన్వీనర్ చిలుక ప్రవీణ్, అశోక్ తెలిపారు.

Load More Related Articles
Load More By admin
Load More In తెలంగాణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *