స్వచ్చంద పదవీ విరమణ చేసిన ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను హెచ్చరించారు. వీఆర్ఎస్ తీసుకున్న తరువాత ఆయా జిల్లాలో పర్యటిస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కరీంనగర్ జిల్లాలో పర్యటించారు.
విధుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించారని ఇద్దరు పంచాయితీ సెక్రటరీలను జిల్లా అధికారులు విధులను నుంచి తప్పిసు ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను కలిశారనే వారిని సస్పెండ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఈ విషయమై ఆర్ఎస్ స్పందించారు. మొన్న కరీంనగర్ లో నన్ను కలిసిండ్రని కక్ష కట్టి ఇద్దరు బహుజన చిరుద్యోగులను సస్పెండ్ చేసినట్లు వార్తలొస్తున్నై. మరి నన్ను గుండెలల్ల పెట్టుకున్న లక్షలాదిమంది తెలంగాణ బిడ్డలనేంజస్తరు? దయచేసి తెలంగాణ ఉద్యమ చరిత్రను మళ్లోపారి చదువుకోండ్రి. తెగేదాక లాగకురి. అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు.