హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీజేపీ నేత ఈటల రాజేందర్ ను ఆ పార్టీ నేతలు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. సంజయ్ వెంట మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి కూడా ఉన్నారు.

ప్రజా దీవెన పాదయాత్ర చేపట్టిన ఈటల పన్నెండు రోజులుగా హుజురాబాద్ సెగ్మెంట్ ను తిరగేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు తీవ్ర జ్వరం, కాళ్లకు పొక్కులు రావడంతో పాదయాత్రకు తాత్కలికంగా వాయిదా వేసుకున్నారు. ఆరోగ్య మెరుగు పడిన తరువాత పాదయాత్ర ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి కొనసాగిస్తానని పేర్కొన్నారు ఈటల.