వైఎస్ఆర్ టీపీ కమిటీలు ఏర్పాటు-అప్పుడే షర్మిలకు షాక్

రాజన్న రాజ్యం తీసుకోస్తానంటూ వైఎస్ఆర్ తెలంగాణా పార్టీని ప్రకటించిన వైఎస్ షర్మిల పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టారు. ఈమేరకు నియోజకవర్గాల వారీగా పార్టీ పదవులను నేతలకు కట్టబెట్టారు షర్మిల. 10మందిని పార్టీ అధికార ప్రతినిధులుగా నియమించిన షర్మిల…ఆ పార్టీ కీలక నేత కొండా రాఘవ రెడ్డిని మాత్రం ముఖ్య అధికార ప్రతినిధిగా నియమించింది. ఇందిరా శోభన్, పిట్టా రాంరెడ్డి, తుడి దేవేందర్ రెడ్డి, ఎపురి సోమన్న, భూమి రెడ్డి , సయ్యద్ ముజ్తబా అహ్మద్, మతీన్ మజదడ్డి , సత్యవతి, భీష్వ రవీందర్, భాస్కర్ రెడ్డి, చల్ల అమరేందర్ రెడ్డిలను స్పోక్స్ పర్సన్స్ గా ప్రకటించారు. సామజిక సమీకరణాలను ఆధారంగా చేసుకొని అన్ని వర్గాలకు అవకాశం కల్పించారు షర్మిల. బీస్సీ, ఎస్సీ, మైనార్టీ , ఓసీ లకు మహిళలకు పార్టీ పదవుల్లో అవకాశం ఇచ్చారు షర్మిల.

YSRTP పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్, కో కన్వీనర్ లను లు కూడా నియమించారు. పార్టీ ఏర్పాటు చేసిన నాటి నుంచి నేతల పని తీరును పరిగణనలోకి తీసుకొని ఈ పదవులను కట్టబెట్టినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత కమిటీలో నేతల పనితీరు ఆధారంగా కష్టపడి పని చేసే నేతలకు భవిష్యత్ లో పెద్ద పదవులు ఇస్తామని ప్రకటించారు. పార్లమెంట్ కన్వీనర్ లు 17 మందిని నియమించగా… కో కన్వీనర్ లుగా 108 మందిని ఎంపిక చేశారు.

కాగా…పార్టీ పదవులు ప్రకటించిన కాసేపటికీ ఆ పార్టీ కీలక నేత చేవెళ్ల ప్రతాప్‌రెడ్డి గుడ్‌బై చెప్పారు.ఆ పార్టీ నేత రాఘవ రెడ్డి వ్యవహారశైలికి నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీన్నిబట్టి ఆ పార్టీలో ఆధిపత్య పోరు మొదలైందనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది.

Load More Related Articles
Load More By admin
Load More In తెలంగాణ

Leave a Reply

Your email address will not be published.