దళితులను అవమానించేలా ఈటల బావ మరిది మధుసూదన్ రెడ్డి ఇతరులతో వాట్సప్ లో చాట్ చేశారనే స్క్రీన్ షాట్ లు నిన్నటి నుంచి వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఈటలను దళిత వర్గాల నుంచి దూరం చేసేందుకు, ఆయనను నేరుగా ఎదుర్కోలేక టీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం ఇలాంటి ఫేక్ స్క్రీన్ షాట్లను క్రియేట్ చేస్తుందని ఈటల వర్గం టీఆర్ఎస్ పై ఎదురుదాడికి దిగింది. ఈ నేపథ్యంలోనే హుజురాబాద్ అంబేద్కర్ విగ్రహానికి నివాలులర్పించాలని ఈటల భార్య జమునతోపాటు ఆయన బావ మరిది వెళ్ళారు.

ఇదే సమయంలో టీఆర్ఎస్ కార్యకర్తలు ర్యాలీగా అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అక్కడ బీజేపీ నేతలు కూడా ఉండటంతో ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు. అనంతరం పరిస్థితి కంట్రోల్ తప్పింది. ఒకరిని ఒకరు తోసుకునే వరకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆగ్రహానికి లోనైనా ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ఒకరిపై ఒకరు చెప్పులు విసురుకున్నారు. పరిస్థితిని గమనించిన పోలీసులు టీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసి అక్కడి నుంచి పొలిసు స్టేషన్ కు తరలించారు.