తెలంగాణ రాజకీయాలు ఇదివరకు ఎపుడు లేనంతంగా రసవత్తరంగా మారాయి. అధికార పార్టీ ప్రతిపక్షాలను నిర్వీర్యం చేస్తుంటే మరోవైపు ఉరకలెత్తిన ఉత్సాహంతో కొత్త నాయకత్వంతో పార్టీలు దూకుడు పెంచాయి. డీ అంటే డీ అంటున్నాయి. పైగా హుజురాబాద్ ఉప ఎన్నిక తోడవ్వడంతో తెలంగాణ రాజకీయాలు రంజుగా మారాయి. ఈ క్రమంలోనే రాజకీయాలు చిత్ర, విచిత్రంగా మారుతున్నాయి.
కొంతకాలం కిందట వరకు ఓ లెక్క ఇప్పుడు మరో లెక్క అనేలా మారాయి తెలంగాణ పాలిటిక్స్. దుబ్బాక ఉప ఎన్నిక తరువాత గేర్ మార్చిన కారు…సాగర్ ఉప ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి తన గెలుపు గాలివాటం కాదని మెసేజ్ ను పంపింది. రేవంత్ కు పీసీసి అద్యక్ష బాధ్యతలను కట్టబెట్టాక కాంగ్రెస్ దూకుడు పెంచగా…సంజయ్ బాధ్యతలు చేపట్టిన తరువాత కమలం కూడా కారును డీకొట్టేందుకు దుసుకేల్తోంది. ఇక, దుబ్బాకలోనైతే కారును గింగిరాలు కొట్టించింది కమలం. ఆ తరువాత సాగర్ కమలం కొట్టుకోపోవడం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాభవం ఆ పార్టీ శ్రేణులను నివ్వెర పర్చాయి. సిట్టింగ్ స్థానంలో కూడా ఓటమి బీజేపీ పార్టీని నిరాశకు గురి చేసింది. మరో వైపు టీఆర్ఎస్ కు చెంపపెట్టులా ఉండేలా దళిత సామజిక వర్గానికి చెందిన బక్కని నర్సింహులును టీ. టీడీపీ అద్యక్షుడిగా నియమించారు. ఎల్ రమణ ఆ పోస్టులో ఉన్నంత కాలం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి చేయాల్సిన కార్యక్రమాలను చేపట్టలేదు. దీంతో ఆ పార్టీ తెలంగాణలో ఉందా అనే అనుమానాలు కూడా ఒకానొక దశలో కలిగాయి. పైగా ఎల్ రమణ టీఆర్ఎస్ కోవర్ట్ అనే ముద్ర కూడా ఉండటంతో టీడీపీకి ఆదరణ కరువు అవుతూ వచ్చింది.

ఎట్టకేలకు ఎల్ రమణ పార్టీ వీడటం…కొత్త నేత అద్యక్ష పదవి చేపట్టడంతో ఆ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని టీడీపీ శ్రేణులు విశ్వసిస్తున్నాయి. రాజన్న రాజ్యం తీసుకోస్తాంటూ వైఎసార్ బొమ్మతో పొలిటికల్ అరంగేట్రం చేసింది షర్మిల. ఓ వైపు అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు వరుస ట్వీట్స్, నిరసన కార్యక్రమాలు చేపడుతూనే ఉంది ఆమె. ఈ క్రమంలోనే హుజురాబాద్ బైపోల్ మరింత హీట్ పుట్టిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల స్వచ్చంద పదవీ విరమణ చేసిన మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా బీఎస్పీ జెండాతో పొలిటికల్ చౌరస్తాకు వస్తు ఉండటంతో రాజకీయాలు పీక్స్ కు చేరాయి.

ఇప్పుడు టీఆర్ఎస్ ఐదు పార్టీల పోటును ఎదుర్కోవాల్సి ఉంది. ఓ వైపు నుంచి రేవంత్ దూకుడు మీదుండటంతో ఇప్పటికే ఓ టీఆర్ఎస్ నేత రేవంత్ చర్చలు జరిపి కాంగ్రెస్ లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. రేవంత్ గనుక ఇదే స్పీడ్ ను కంటిన్యూ చేస్తూ… హుజురాబాద్ బైపోల్ లో టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చినా అధికార పార్టీ నుంచి అసంతృప్త నేతలు, ద్వితీయ శ్రేణి నాయకత్వం కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. అంతర్గతంగా ఆ పార్టీ నేతలే కేసీఆర్ వ్యవహారశైలిపై అసంతృప్తిగా ఉన్నారనేది ఓపెన్ సీక్రెట్. అది హుజురాబాద్ తరువాత ఈటల గెలిచినా, కాంగ్రెస్ ప్రభావం చూపినా టీఆర్ఎస్ కకావికలం అవ్వడం మాత్రం ఖాయమనేది విశ్లేషకుల అంచనా.

మరో వైపు…ఈ ఉప ఎన్నిక కేసీఆర్ వర్సెస్ ఈటల గా మారడంతో…ఈ బైపోల్ ను ఆ పార్టీ నేతలు సీరియస్ గా తీసుకున్నారు. మంత్రులంతా ఒకరు తరువాత ఒకరు హుజురాబాద్ పై దండయాత్ర చేస్తున్నారు. ఇక ఇతర నియోజకవర్గాలకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మోహరించడంతో…బీజేపీ కూడా అదే విధంగా ముందుకు వెళ్తోంది. ఇప్పటికే ఈటల ప్రజా దీవెన పాదయాత్రతో ప్రజల మధ్యకు వెళ్ళారు. కేసీఆర్ వైఖరిని ఎండగడుతూ ముందుకు సాగుతున్నారు ఈటల. దీంతో హుజురాబాద్ లో టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది.
ఇక టీడీపీ విషయానికి వస్తే ఇప్పుడే నూతన నాయకత్వం బాధ్యతలు చేపట్టింది. అక్కడ పోటీ చేయాలా లేక, కేసీఆర్ పై పోరాడుతానని స్పష్టం చేసిన బీజేపీ అభ్యర్థి ఈటలకు సపోర్ట్ చేసి ఉద్యమ శక్తులకు మరింత బలాన్ని ఇవ్వాలనుకుంటుందా అన్నది తేలాల్సి ఉంది. ఇదివరకు కూడా బీజేపీతో కలిసి పోటీ చేసినా అనుభవాలు ఉండటం, ఇప్పుడు ఉద్యమ శక్తుల ఐక్యతకు మద్దతుగా నిలవాలని ఆలోచన చేస్తే కనుక తెలంగాణ టీడీపీ నాయకత్వం ఈటలకు సపోర్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. వైసీఆర్ టీపీ తో ముందుకు వచ్చినా వైఎస్ షర్మిల హుజురాబాద్ లో తమ పార్టీ అభ్యర్థిని బరిలో నిలుపుతారా..? అన్నది తేలాల్సి ఉంది. ఇంకా ఈ విషయంలో షర్మిల ఎలాంటి నిర్ణయాన్ని వెలువరించలేదు. ఒకవేళ పోటీ చేస్తే ఎవర్నీ బరిలో దింపాలి అన్న విషయంలో ఆ పార్టీ ఇప్పటికీ ఓ క్లారిటీకి రాలేకపోతోంది. బీఎస్పీలో చేరనున్న మాజీ ఐ పీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్…హుజురాబాద్ నుంచి ఆ పార్టీ నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తారా అన్నది ఆసక్తి కరంగా మారింది. చూడాలి మరి ఆయన పార్టీలో చేరిన తరువాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో
టోటల్ గా…హుజురాబాద్ నోటిఫికేషన్ రాకపోయినా రాజకీయం మాత్రం ఎప్పుడు లేని విధంగా హాట్ హట్ గా కనిపిస్తోంది.