తానొకటి తలిస్తే దైవమొకటి తలిచినట్లుంది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు. తెలంగాణలో అసలు ప్రతిపక్షమే లేకుండా చేయాలని ఆ దిశగా ముందుకు సాగిన కేసీఆర్ కొంతమేర సఫలీకృతం అయ్యారు. కాని దాని పర్యవసానం మాత్రం చాలా గట్టిగానే ఉండనున్నట్లు తెలుస్తోంది. విపక్షమే లేకుండా ఏకచత్రాదిపత్యం చెలాయించాలని చూసిన కేసీఆర్ కు పెద్ద స్ట్రోక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. స్వపక్షం నుంచి పెద్ద ముప్పే పొంచి ఉందనే వార్త కలకలం రేపుతోందిప్పుడు.
అధికార పార్టీకి చెందిన నలభై మంది కీలక నేతలు…నూతన టి.పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తో టచ్ లోకి వెళ్ళినట్లు ఓ వార్త ప్రగతి భవన్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. అయితే వారంతా ఆషామాషీ లీడర్లేమి కాదు…అందులో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారనే వార్త వైరల్ గా మారింది. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి టికెట్ రాదనీ కొందరు…మరోసారి టీఆర్ఎస్ అధికారంలోకి రావడం కష్టమనే అభిప్రాయంతో వారంతా రేవంత్ తో టచ్ లోకి వెళ్ళినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆ నలభై మందిలో కొంతమంది నేతలు ఢిల్లీలో రేవంత్ ను కలుసుకోగా..మరికొంతమంది బెంగళూరులో కలుసుకున్నట్లు తెలుస్తోంది.
బలమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న కేసీఆర్ వద్దకు ఈ విషయం చేరిందట. కాకపోతే రేవంత్ ను కలిసిన ఆ నేతలెవరో క్లారిటీగా తెలియరాలేదట. దాంతో ముందస్తు ప్రమాదాన్ని అంచనా వేసిన కేసీఆర్ జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు ప్రగతి భవన్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అందుకే ఎ జిల్లా నుంచి… ఎ కీలక నేత కూడా కాంగ్రెస్ లో చేరినా బాధ్యత అంత ఆ జిల్లాకు చెందిన మంత్రులదేనని అల్టిమేటం విధించారట కేసీఆర్. ఇదివరకు ఉన్న విబేధాలను పక్కన బెట్టేసి…నేతలతో సఖ్యత మెయింటేన్ చేయాలనీ లేదంటే…ఒక్కరు కూడా కాంగ్రెస్ లో చేరినా మంత్రులపై వేటు తప్పదనే హెచ్చరికను కేసీఆర్ జారీ చేశారట. మరో వైపు…మంత్రులపై ఎ చర్యలు తీసుకున్నా మళ్ళీ అది ఈటల ఇష్యూలా మారితే పరిస్థితి ఎంటని కేసీఆర్ మల్లగుల్లాలు పడుతున్నారట. దీంతో ఇప్పుడు కేసీఆర్ తాను తీసుకున్న గోయిలో తనే పడినట్లు ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.