భవిష్యవాణి వినిపించే స్వర్ణలత గురించి మీకు తెలుసా..?

బోనాలు వచ్చాయంటే చాలు…ఆమె ఎం చెప్తుందోననే ఉత్కంట అందరిలోనూ ఉంటుంది. ఆమె చెప్పే భవిష్యవాణిపై అందరికీ ఓ నమ్మకం. ఇప్పటికే అర్థం అయింది అనుకుంటా ఆమె ఎవరో…సికింద్రాబాద్ బోనాల సందర్భంగా నిర్వహించే రంగం కార్యక్రమంలో భవిష్యవాణి వినిపించే స్వర్ణలత గురించే ఈ ఇంట్రడక్షన్. ఇప్పుడు ఆమె గురించి ఎందుకుంటరా..?

ప్రజలను బాధపెట్టొద్దు, సగం సంతోషమే: భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత | matangi  swarnalatha's bhavishyavani in ujjaini mahankali temple - Telugu Oneindia

నేతిబీరకాయలో నెయ్యుండదు…బంగారు తెలంగాణలో బంగారం ఉండదన్నట్లు స్వర్ణలత అని పేరే కాని ఆమె మెడలో ఇసుమంత బంగారం కూడా ఉండదు. ఎంతోమంది జీవితాలు, రాబోయే ప్రకృతి వైపరీత్యాల గురించి , ప్రమాదం నుంచి ఎలా బయట పడాలో వివరించే స్వర్ణలత జీవితం గురించి చాలా మంది నానా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. అమ్మవారుగా కొలిచే ఆమె వెల్ సేటిల్డ్ అని…ప్రతి ఏటా బోనాల సమయంలో భక్తుల బాగానే సమర్పిస్తారని ఇలా రకరకాలుగా ఊహించేసుకుంటారు. కాని స్వర్ణలత అసలు జీవితం గురించి తెలిస్తే షాక్ అవ్వడం మన వంతు అవుతుంది. సాధారణ మహిళల లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో స్వర్ణలతది కూడా అలాగే ఉంటుంది. చాలా మంది అనుకున్నట్లు ఆమెమీ పెద్ద బంగ్లాలో ఉండదు.

Page 2873 Photo Feature Articles on Telugu Oneindia

సికింద్రాబాద్‌ సమీపంలోని తుకారాంగేట్‌ ఇరుకు గల్లీలో ఒక చిన్న అద్దె ఇంట్లో నివాసముంటుంది. టైలరింగ్ చేస్తూ నాలుగు పైసలు వెనకేసుకుంటూ కాలం వెళ్ళదీస్తోంది ఆమె. టైలరింగ్ ఆగిపోతే ఆమె బతుకు బండి ముందుకు సాగని పరిస్థితి. ఇక, అందరికీ జీవితంలో ఓ ప్రత్యేకమైన రోజు ఉంటుందన్నట్లు ఆమెకు ఓ రోజు ఉంది. ఆ రోజు కోసమే వేలాది మంది భక్తులు ఎదురు చూస్తుంటారు. బోనాల సందర్భంగా రంగం కార్యక్రమంలో ఆమె చెప్పే భవిష్యవాణి కోసం ఆత్రుతగా ఎదురు చూస్తారు. హైదరాబాద్‌‌లో బోనాల సందర్భంగా మాతంగి స్వర్ణలత రంగం వినిపించడం ఆనవాయితీ. దీన్ని భవిష్యవాణిగా భక్తులు విశ్వసిస్తారు. ప్రపంచాన్ని జాగృతం చేసేందుకు భవిష్యవాణి వినిపిస్తుందని భావిస్తున్న స్వర్ణలత జీవితం మాత్రం చాలా కష్ట నష్టాలకు ఓర్చి నడుస్తోంది. సంప్రదాయాన్ని కాపాడుతూ ముందుకు సాగుతున్న మాతంగి స్వర్ణలత వంటి వారిని ప్రభుత్వం గౌరవించాల్సిన అవసరం ఉంది. ఆమెకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు నగర జనం.

The 'Rangam' is key in Ujjaini Mahankali Bonalu

Load More Related Articles
Load More By admin
Load More In తెలంగాణ

Leave a Reply

Your email address will not be published.