రామప్పకు యునెస్కో గుర్తింపు-ఒన్ చేసుకోలేకపోతున్న దళిత సామజిక వర్గం

కనిపించని శక్తులేవో నడిపిస్తే నడిచిన మనుషులం అంటాడు శ్రీ శ్రీ. ఇప్పుడు రామప్పకు అంతర్జాతీయ గుర్తింపు రావడానికి కనిపించే శక్తిగా ప్రభుత్వం కనిపిస్తుంది…కాని కనిపించని శక్తిగా ఆ ఆలయ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఉండిపోయారు. ఇలా చరిత్ర నిర్మాణంలో సామాన్యులు, కష్టజీవులు మరుగున పడిపోతున్న సందర్భంగా…కాలం విస్మరిస్తున్న అ కనిపించని శక్తుల త్యాగాలను గుండెలకద్దుకుందాం.

రామప్ప గుడికి యునెస్కో గుర్తింపు రావడానికి తెలంగాణ ప్రభుత్వమే కారణమని ఆ పార్టీ శ్రేణులు, అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. కాని ఆ గుర్తింపు రావడానికి ప్రధాన కారణమైన వారి గురించి మాట్లాడకోవడానికి, చెప్పడానికి ఎవరి గొంతు పెగలడం లేదు. తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలేవరు అంటూ కష్టజీవుల గురించి చెప్తూ శ్రీ శ్రీ అన్న మాటలివి. ఇప్పుడు రామప్ప ఆలయ నిర్మాణానికి రాలేత్తినన కష్టజీవుల కష్టాన్ని వదిలేసి..పైపైచ్చు మరమ్మతులు చేసినా ప్రభుత్వం గురించి ప్రజల నుంచి మీడియా వరకు కోడై కూస్తోంది. ఇది విషాదం. ప్రతి సందర్భం ఓ చారిత్రిక సందర్భాన్ని బయట పెట్టేందుకే ఓ అవకాశమే కాని…దాని విడమార్చి చెప్పడంలో, ప్రజలకు చేరువ చేయడంలోనే లోపమున్నది. ఈ లోపాన్ని గుర్తించనంత కాలం కష్ట జీవుల కష్టం చరిత్రలో చివరి పేజీలో కాదు కదా మరుగున పడిపోవడం ఖయమనేది చరిత్ర మరోసారి స్పష్టం చేస్తోంది. ఇప్పుడు రామప్ప్ప యునెస్కో గుర్తింపు విషయంలో కూడా ఇదే జరుగుతోంది. రామప్ప గుడి నిర్మాణానికి బండలు మోసి గుండెలు పగలగొట్టుకున్న వేలాది మంది దళితుల గురుంచి ఆ సామజిక వర్గంతోపాటు ఆలోచన పరులు కూడా చెప్పడం లేదు. రామప్ప్ప యునెస్కో గుర్తింపులో దళిత సామజిక వర్గాల పాత్ర ఉన్నదని దానిని ఒన్ చేసుకునేందుకు తటపటాయిస్తున్నారు. 800 ఏండ్ల క్రితం కాకతీయుల పరిపాలనలో అలాంటి కట్టడాలు కట్టడానికి ఏనుగులచే బండలు మోపించి, వాటికి ఆహారం పెట్టడానికి, రాజుల ఖజానా ఖాళీ అవుతుందని గ్రహించి …ఏ ప్రతిఫలం ఆశించని, పని చేయడమే తమ ధర్మంగా భావించే మూగ జీవులైన దళితులపై ఆ బండరాళ్ళ బరువుని మోపారు. ఈ మొత్తం రాజుల కట్టడాలకు దళితుల భుజాలకు బండరాళ్లను కట్టి మోపించారు. ఆ బండలను దళితులు ఈడుస్తూ ఈడుస్తూ ఎన్ని ప్రాణాలు పోగొట్టుకున్నారో.? ఈ సందర్భంగా అయినా ఎవరూ చెప్పడం లేదు. వారి త్యాగాలను పై పెచ్చు గుర్తు చేయడం లేదు. ఇప్పటికైనా బుద్ది జీవులైనా ఈ విషయాన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. లేదంటే…చరిత్ర అందించిన ఓ అవకాశం మరొకరి ఖాతాలో పడే ప్రమాదముందని కొంతమంది దళిత మేధావులు చెప్తున్నారు.

Load More Related Articles
Load More By admin
Load More In తెలంగాణ

Leave a Reply

Your email address will not be published.