సీరియస్ ఇష్యూ- మెరుగైన చానెల్ లో యాంకర్ పై సహా యాంకర్స్ వేధింపులు

టాప్ చానెల్ అంటూ తెగ హడావిడి చేసే చానెల్ అది. సమాజ బాగోగుల మొత్తం మేమే మోస్తున్నాం అన్నట్లు కలరింగ్. చెప్పేందుకే నీతులు పాటించడానికి కాదు అన్నట్లుంది ఆ చానెల్ యవ్వారం. మెరుగైన చానెల్ లో జరిగిన ఓ విషయం ఇప్పుడు మీడియా సర్కిల్లో చర్చనీయంశంగా మారింది.

మెరుగైన చానెల్ అని చెప్పుకునే ఆ చానెల్ లో పని చేసే ఇద్దరు యాంకర్స్ పై సైబర్ క్రైం లో కేసు నమోదైంది. వారిపై IPC 66, R/w 43, 84(B)ఐటి ఆక్ట్, R/w 511 కింద అభియోగాలు మోపారు పోలీసులు. ఇంతకీ విషయం ఏంటంటే…అందులోనే పని చేసే యాంకర్ ఫోన్ ను మరో ఇద్దరు యాంకర్స్ దొంగలించి ఆమెను బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఫోన్ లో ఉన్న వ్యక్తిగత ఫొటోస్, వీడియోస్ ను బయట పెడతామని బాధిత యాంకర్ మరో ఇద్దరు యాంకర్స్ పై ఫిర్యాదు చేసింది. వాటిని అడ్డు పెట్టుకొని శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నట్లు ఫిర్యాదు చేసింది.

అయితే..ఈ వ్యవహరం చాలా రోజుల నుంచే నడుస్తున్నట్లు తెలుస్తోంది. గతంలోనే ఈ విషయమై బాధిత యాంకర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే…కొంతమంది పెద్దలు రంగంలోకి దిగి ఆ కంప్లయింట్ ను తీసుకోవద్దని చెప్పినట్లు సమాచారం. దీంతో ఆమె ఫిర్యాదును పోలీసులు పక్కన బెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఇష్యూను మీకు మీరే పరిష్కరించుకోవాలని సూచించారట పోలీసులు. కాని…వేధింపులు తీవ్రం కావడంతో బాధిత యాంకర్ పోలీసుకు మరోసారి ఫిర్యాదు చేసింది. ఈసారి మాత్రం ఊరుకునేదే లేదని…తనకు న్యాయం చేయాలనీ పట్టుబట్టడంతో చివరికీ చేసేదేమీ లేక పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే..ఇంత పెద్ద గొడవ జరిగినా మెరుగైన చానెల్ యాజమాన్యం మాత్రం వారికీ…మేమోలు ఇచ్చి కొన్ని రోజులు యాంకరింగ్ కు దూరంగా ఉండాలని సూచించారట. ఓ యాంకర్ ను చానెల్ లో పని చేసే మరో ఇద్దరు యాంకర్సే వేధిస్తుంటే…సీరియస్ యాక్షన్స్ తీసుకోవాల్సిందిపోయి…గుట్టు చప్పుడు కాకుండా మెమోలు ఇచ్చి వదిలేయడం ఏంటనే విమర్శలు వస్తున్నాయి. బాధిత యాంకర్ వైపు స్టాండ్ తీసుకోవాల్సిన చానెల్ యాజమాన్యం..తిరిగి ఆమెనే టార్గెట్ చేశారనే టాక్ వినిపిస్తోంది. అక్కడి వ్యవహారాలను చూసే ప్రేజెంటర్ తోపాటు, హెచ్ ఆర్ కూడా ఆమెదే తప్పన్నట్లు మాట్లాడినట్లు సమాచారం. ఈ వ్యవహారం కాస్తా బయట పడితే పరిస్థితి ఏంటో అన్న టెన్షన్ మెరుగైన చానెల్ పెద్దలను వెంటాడుతోంది. అందుకే ఈ వ్యవహారాన్ని ఎక్కడా లీక్ కాకుండా జాగ్రత్తలు పడినట్లు ప్రచారం జరుగుతోంది. మహిళల రక్షణ విషయంలో గంటల కొద్దీ కథనాలు ప్రసారం చేసే మెరుగైన చానెల్…ఇప్పుడు వారి సంస్థలోనే ఓ మహిళ యాంకర్ కు భద్రత లేకుండా పోవడంపై మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Load More Related Articles
Load More By admin
Load More In క్రైమ్

Leave a Reply

Your email address will not be published.