కవిత్వ మాంత్రికుడి వర్ధంతి

తెలుగు సాహితీవనంలో ఓ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన కవితాసుమం ఆయన. ప్రజలను అజ్ఞానులుగా చేస్తోన్న మూడాచారాలపై కవిత్వంతో మేల్కొలోపి తిరుగుబాటు జెండనేగారేసిన చైత్యన్య దీప్తి. నూతన కవిత్వ ఒరవడి నుంచి వచ్చి , సామజిక ప్రయోజనం ఆశించి రచనలు చేసిన సాహిత్య సృష్టికర్తగా పేరొందిన నవయుగ కవి చక్రవర్తి. కవితాన్ని ఆయుధంగా మలిచి మూడచారాలపై పోరు కొనసాగించారు ఆయన. నిషేదించిన రాయే పునాది రాయిగా మారుతుందన్నట్లు…ఎక్కడైతే చీత్కారం ఎదురైందో అక్కడో సన్మానం పొందిన మహనీయుడు గుర్రం జాషువా…ఆయన వర్ధంతి సందర్భంగా స్పెషల్ స్టొరీ

గుంటూరు జిల్లా వినుకొండలో 1895 సెప్టెంబరు 28న వీరయ్య, లింగమ్మ దంపతులకు జాషువా జన్మించారు. తల్లిదండ్రులు ఒకే కులానికి చెందిన వారు కాకపోవడంతో చిన్న వయస్సులోనే ఎన్నో అవమానాలను ఎదుర్కున్నారు జాషువా. మూఢాచారాలతో నిండిన ఆనాటి సమాజంలో ఎన్నో అవమానాలను చవి చూశారు. చదువుకుందామని స్కూల్ కు వెళ్తే కులం పేరుతో హేళనలు..హాయిగా సాగిపోవాల్సిన బాల్యం…అవమానాల కొలిమిలో భగభగ మండింది. చిన్నప్పుడే ఆత్మగౌరవం కోసం తపించింది ఆ పసి మనస్సు. కులం పేరుతో వేధించే వాళ్ళను చూస్తూ ఊరుకోకుండా…జాషువా తిరగబడేవాడు. చిన్నప్పుడే చైతన్యాన్ని ఒంటబట్టించుకున్నాడు. పోరాడితే పోయేదేమీ లేదనట్లుగా అవమానం ఎదురైతే ఆత్మగౌరవం కోసం తిరగబడేవాడు.

చిన్న వయస్సులోనే 1910లో జాషువా మేరీని పెళ్లి చేసుకున్నాడు. ఓ మిషనరీ స్కూల్ లో నెలకు 3 రూపాయల జీతంతో ఉద్యోగాన్ని పొందాడు. ఆ డబ్బుతో కుటుంబాన్ని సాకాలనుకున్న జాషువా కళలు ఆవిరయ్యాయి. ఆ ఉద్యోగం పోవడంతో రాజమండ్రి వెళ్లి 1915-16లో అక్కడ సినిమా వాచకుడిగా పని చేశారు. కథను అనుగుణంగా కథ, సంబాషణలు చదువుతూ పోవడమే జాషువా పని. మళ్ళీ అక్కడి నుంచి గుంటూరు కు మకాం మార్చాల్సి వచ్చింది. అక్కడ లూథరిన్ చర్చి నడుపుతున్న ఉపాధ్యాయ శిక్షణాలయంలో టీచర్‌గా దశాబ్ద కాలం పాటు పని చేశారు. అనంతరం 1928 నుంచి 1942 వరకు గుంటూరులోనే ఉన్నత పాఠశాలలో తెలుగు పండితుడిగా ఉన్నారు. అలా ఉద్యోగ జీవితమంతా అనేక ఒడిదుడుకులతో సాగింది.

సెకండ్ వరల్డ్ వార్ సమయంలో యుద్ద ప్రచారకుడిగా విధులు నిర్వర్తించారు జాషువా.1957-59 మధ్య కాలంలో మద్రాసు రేడియో కేంద్రంలో ప్రోగ్రాం ప్రొడ్యుసర్ గా వ్యవహరించారు. ఆయన మాటలు వినసొంపుగా ఉండేవి. చిన్నప్పటి నుంచే జాషువాలో సృజనాత్మకత ఉండేది. బొమ్మలు గీయడం పాటలు పాడటం బాగా పాడేవారు. తెలుగు ఉపాధ్యాయుడిగా పని చేసిన జాషువా 36 గ్రంథాలు మరెన్నో కవితా ఖండికలు రచించారు. 1941 నాటి కాలంలో ఆయన రచనల్లోని ఉత్తమామైంది గబ్బిలం. ఇప్పటికీ గబ్బిలం కథాంశం ఎంతోమందిని ఆలోచనలో పడేస్తుంది. కాళిదాసు మేఘ సందేశం తరహాలో ఈ కథాంశం సాగుతుంది. అయితే ఇందులో సందేశాన్ని అంటరాని కులానికి చెందిన కథా నాయకుడు తన గోడును కాశీ విశ్వనాథునికి చేరవేయమని గబ్బిలంతో సందేశం పంపడమే దీని కథాంశం. గుడిలోకి దళితులకు ప్రవేశం లేదు కానీ గబ్బిలానికి అడ్డు లేదు. కథా నాయకుడి వేదనను వర్ణించిన తీరు హృదయాలను కలచివేస్తుంది.1932లో వ చ్చిన ఫిరదౌసి మరో ప్రధాన రచన. పర్షియన్ గజినీ మొహమ్మద్ ఆస్థానంలో ఉన్న కవి ఫిరదౌసి. అతనికి రాజు మాటకొక బంగారు నాణెం ఇస్తానని చెప్తాడు. ఆ కవి పదేళ్లు శ్రమించి మహా కావ్యాన్ని రాస్తాడు. చివరకు అసూయపరుల మాటలు విని రాజు మాట తప్పాడు. ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్న ఆ కవి హృదయాన్ని ఆ రచనలో అద్భుతంగా వర్ణించారు జాషువా. మహాత్ముడి మరణ వార్త విని ఆయనకు అంజలి ఘటిస్తూ 1948లో ‘బాపూజీ’ రచన చేశారు. రుక్మిణీ కల్యాణం, చిదానంద ప్రభాతం, సంసార సాగరం, కుశలోపాఖ్యానం, కోకిల, కృష్ణనాడి, శివాజీ ప్రబంధం, వీరబాయి, కృష్ణదేవరాయలు, వేమన యోగీంద్రుడు, భారతమాత, భారత వీరుడు, 1932లో రాసిన స్వప్నకథ, ముంతాజ్ మహల్, సింధూరం, 1958లో క్రీస్తు చరిత్ర, 1966లో నాగార్జున సాగరం, నా కథ లాంటి రచనలెన్నో ఆయన చేతి నుంచి జాలువారాయి. జీవనం కోసం ఎన్నో రకాల ఉద్యోగాలు చేసిన జాషువాకు 1964లో ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో సభ్యత్వం లభించింది.1971 జూలై 24న గుంటూరులో గుర్రం జాషువా మరణించారు.

Load More Related Articles
Load More By admin
Load More In ఆంధ్రప్రదేశ్

Leave a Reply

Your email address will not be published.