ఇటీవలే స్వచ్చంద పదవీ విరమణ చేసిన ఐపీఎస్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ దళిత బంధుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలా డబ్బులు ఇవ్వడం మానేసి..గురుకులాల అభివృద్దికి ఖర్చు చేస్తే ఎంతో ప్రయోజనముంటుందని సూచించారు ఆయన.
తెలంగాణలో దళితుల అభ్యున్నతికి దళిత బంధు అంటూ ప్రకటించిన పథకంతో ఎలాంటి ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. సీఎం హుజురాబాద్ లో ఖర్చు చేసే వెయ్యి కోట్లు… రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలల అభివృద్ధి కోసం ఖర్చు చేస్తే ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్ మారుతుందని, అప్పుడు వారి కుటుంబాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని వ్యాఖ్యానించారు. ఈ దేశంలో ఉన్న యూనివర్శిటీలలో కేవలం 2శాతం మాత్రమే దళిత ప్రొఫెసర్లున్నట్లు ప్రవీణ్ కుమార్ గుర్తు చేశారు.