హుజురాబాద్ పై పట్టు బిగించేందుకు అధికార టీఆర్ఎస్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అక్కడ ఎలాగైనా గెలిచి తీరాలని పట్టుదలగా ఉన్న గులాబీ దళపతి ఇప్పటికే హుజురాబాద్ కు వరాల జల్లు కుర్పిస్తుండగానే పదవుల పంపకంలోనూ హుజురాబాద్ పై ప్రేమను చూపిస్తున్నారు కేసీఆర్. తాజాగా ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ పదవిని కూడా హుజురాబాద్ కు చెందిన నేతకే కట్టబెడుతూ కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
హుజురాబాద్ ను కేసీఆర్ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో వేరేగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే సర్వేల నివేదిక ఆధారంగా ఓటమి తప్పదని భావించి అక్కడ ఎస్సీల ఓట్లు గంపగుత్తగా పడేలా దళిత బంధును హుజురాబాద్ నుంచే అమలు చేస్తామని ప్రకటించారు కేసీఆర్. అక్కడ దళితుల ఓట్లు 40 వేలకు పైగానే ఉంటాయి. ఈ ఓట్లు ఎంత కీలకమో అంచనా వేసిన కేసీఆర్…దళిత బందును అక్కడి నుంచే అమలు చేస్తే ఆ ఓట్లన్నీ టీఆర్ఎస్ కే పడితే గెలుపు ఈజీ అవుతుందని అనుకుంటున్నారు కేసీఆర్. ఇదిలా ఉండగానే…ఖాళీగా ఉన్న ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ పదవిని ఈటల సన్నితుడు, దళిత సామజిక వర్గానికి చెందిన బండా శ్రీనివాస్ కు కట్టబెడుతూ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఓ వైపు దళితులను ఆదుకుంటున్నామనే మెసేజ్ ను పంపుతూనే…మరో వైపు పదవుల పంపకంలోనూ హుజురాబాద్ నేతకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామనే అంశాన్ని జనాల్లోకి తీసుకేల్లేలా టీఆర్ఎస్ ప్రణాలికలు రూపొందిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనబడుతోంది. టోటల్ గా హుజురాబాద్ ఉప ఎన్నికలో కేసీఆర్ దృష్టంతా దళిత సామాజిక వర్గం ఓట్లపైనే ఉన్నట్లు కనపడుతోంది.