మాజీమంత్రి, బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు అధికార పార్టీలోకి జంప్ అవుతారా..?అంటే అవుననే తెలుస్తోంది. కొంతకాలంగా పార్టీతో అంటీముట్టినట్లుగా ఉంటోన్న ఆయన బీజేపీని వీడి టీఆర్ఎస్ లో చేరాలని భావిస్తునట్లు సమాచారం.
మాజీమంత్రి, బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు కారేక్కనున్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా బీజేపీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించని మోత్కుపల్లి..ఇటీవల కేసీఆర్ ఏర్పాటు చేసిన దళిత నేతల సమావేశానికి హాజరయ్యారు. కనీసం సిఎంతో భేటీకి వెళ్తున్నానని నాయకత్వానికి సమాచారం ఇవ్వకుండానే మోత్కుపల్లి ప్రగతి భవన్ కు వెళ్లటంపై పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే, ఈ భేటీకి ముందు నుంచే ఆయన టీఆర్ఎస్ తో టచ్ లో ఉన్నారనే వార్తలు వినిపించాయి. తాజాగా ఆయన బీజేపీకి రాజీనామా చేశారు. దీంతో మోత్కుపల్లి టీఆర్ఎస్ లో చేరటం లాంఛనమేకానుంది. దళిత బంధు ప్రకటించిన రోజు నుండి… పలువురు దళిత నేతలను పార్టీలోకి చేర్చుకునేలా టీఆర్ఎస్ ఇప్పటికే కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.