చనిపోయినా మానవత్వం ఎక్కడో కాదు-తెలంగాణలోనే

మానవత్వం చనిపోయింది అక్కడ. వరద ఉదృతికి కొట్టుకుపోయేలా ఉన్న వ్యక్తిని కాపాడాల్సిన స్థానికులు..అతని హాహాకారాలు చూసి సైలెంట్ గా ఉన్నారు తప్పితే..కనీస అంటే కనీసం అతని కాపాడేందుకు ఎలాంటి ప్రయత్నం చేయకుండా అక్కడ మానవత్వాన్ని సమాధి చేశారు.

జయశంకర్ భూపాల్‌పల్లి జిల్లాలో ఓ వ్యక్తి వాగును దాటేందుకు ప్రయత్నిస్తుండగా…వరద ఉద్రుతి సడెన్ గా పెరిగింది. దీంతో అతను ఎలాగోలా అవతలి వైపు చేరేందుకు మెల్ల…మెల్లగా వెళ్తున్నాడు. ఆ వరద ఉద్రుతికి తను గల్లంతు అవుతానని భావించి తనను కాపాడాలని ఆరుస్తున్నాడు. కాని వాళ్ళు మాత్రం ఏదైనా సినిమా కోసం ఈ సీన్ చిత్రికరిస్తున్నట్లుగా అతని హహకారాలను చూస్తూ మిన్నకుండిపోయారె కాని…అతని కాపాడేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదు. ఈ ఘటనను చూసిన చాలామంది నెటిజన్లు ఇక్కడ గల్లంతయింది ఆ వ్యక్తే కాదు.. మనుషుల్లో వివేకం, విచక్షణ, మానవత్వం కూడా అంటూ మండిపడుతున్నారు. అంత ప్రమాదంలో ఆటవికంగా‌ చూస్తూ ఉండిపోయారే కానీ ఒక్కడైనా ఓ కట్టెనో, లేద వెనక ఉన్న లారీల్లో తాడునో తెచ్చి అందించలేకపోయారని అక్కడి వారిని కడిగేస్తున్నారు. ఇక, గల్లంతయిన వ్యక్తికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Load More Related Articles
Load More By admin
Load More In తెలంగాణ

Leave a Reply

Your email address will not be published.