ఇంటర్ సెకండియర్ ఫలితాలొస్తున్నాయి..

ఇంటర్మీడియట్ సెకండియర్ ఫలితాలను రెండు , మూడు రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉంది. మొదట సెకండియర్ ఫలితాలను విడుదల చేయాలనీ భావించిన ఇంటర్ బోర్డు ఈమేరకు కసరత్తు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. అన్ని ఆనుకున్నట్టు జరిగితే ఈ రెండు, మూడు రోజుల్లో సెకండియర్ ఫలితాలను విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది.

ఏపీలో ఇంటర్ సెకండియర్ ఫలితాలు రెండు, మూడు రోజుల్లో విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. కరోనా నేపథ్యంలో అనేక హైడ్రామాల మధ్య నడిచిన పరీక్షల నిర్వహణ వ్యవహారం…చివరికీ సుప్రీం సూచనలతో రద్దు అయ్యాయి. పరీక్షలు అయితే రద్దయ్యాయి కాని…మార్కుల విడుదలకు ఎలాంటి ఫార్ములాను అనుసరిస్తారోనని అంత ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ ఫలితాలకు సంబంధించిన ఫార్ములాను సిఫారసు చేసేందుకు ప్రభుత్వం రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఛాయారతన్‌ నేతృత్వంలోని హైపవర్ కమిటీని నియమించింది. అనేక అంశాలను పరిశీలించిన ఈ కమిటీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ రాష్ట్రాలు పరీక్షల రద్దుతో ఎలాంటి విధానాన్ని అనుసరిస్తున్నాయో తెలుసుకున్నాయి. చివరికీ…ఈ కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు.. పదో తరగతి మార్కులను 30 శాతంగా, ఇంటర్‌ ఫస్టియర్‌ మార్కులను 70 శాతంగా పరిగణించి మొత్తం 100 మార్కులకు విద్యార్థి సాధించిన మార్కులను బట్టి ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలను ప్రకటిస్తారు.

Load More Related Articles
Load More By admin
Load More In ఆంధ్రప్రదేశ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *