ప్రవీణ్ కుమార్ రాజీనామా ఆమోదం-టీఆర్ఎస్ వ్యూహమేనా..?

మాజీ ఐపీఎస్ , అదనపు డీజీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకోవడం ఓ సంచలనం. ఆయన ఈ సడెన్ డెసిషన్ తీసుకోవడానికి కారణమేంటి..? ఆర్ఎస్ రాజీనామాను 24 గంటల్లోనే ప్రభుత్వం ఆమోదించడం వెనక అధికార పార్టీ ఏమైనా ఉందా..?

ఇంకా ఆరేళ్ళ సర్వీసు ఉండగానే ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకోవడం సంచలనంగా మారింది. గురుకులాల కార్యదర్శిగా కొనసాగుతున్న ఆయన…కేసీఆర్ తో రిలేషన్ బాగానే మెయింటేన్ చేశారు. గురుకులాల బలోపేతానికి ఆర్ఎస్ నిర్ణయాల వెనక కేసీఆర్ ఉన్నారనేది ఓపెన్ సీక్రెట్. ఇక, ప్రవీణ్ కుమార్ సర్వీసు ముగిసినా కూడా ఆయన పదవీ కాలాన్ని పొడిగించాలని కేసీఆర్ కోరుతారని కూడా ఆ మధ్య ప్రచారం కూడా జరిగింది. అంతలా ఇద్దరి మధ్య సఖ్యత కుదిరిందని…గురుకులాల్లో సంస్కరణల కోసం ఆర్ఎస్ ఏదీ అడిగినా కూడా…కేసీఆర్ అంగీకారం తెలుపుతున్నారనే భావన ఉంది. గురుకులాల్లో కార్పోరేట్ కు దీటుగా విద్యనూ అందించేందుకు కృషి చేస్తానని ఆర్ఎస్ ప్రకటించారు. కాని సడెన్ గా…ప్రవీణ్ కుమార్ వీఆరఎస్ కు దరఖాస్తు చేసుకోవడం సంచలనంగా మారింది. మొదట్లో ఆయన హుజురాబాద్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలో ఉంటారని..అందుకే ఈ రాజీనామా అని ప్రచారం జరిగింది. అయితే ఆయన రాజీనామా చేసిన24 గంటల్లోనే ఆయన వినతిని అంగీకరించడం వెనక టీఆర్ఎస్ ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గతంలో సీనియర్ ఐపీఎస్ అధికారి వీకే సింగ్ ఇదే తరహాలో వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకుంటే నెలల తరబడి పెండింగ్ లో ఉంచిన ప్రభుత్వం…ఐఎఎస్ అధికారి ఆకునూరి మురళి విషయంలోనూ రెండున్నర నెలల పాటు సాగదీసింది. ఈ రెండు సందర్భాల్లో రాజీనామా ఆమోదం విషయంలో ఆలస్యం చేసిన సర్కార్ ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విషయంలో మాత్రం 24 గంటల్లోనే నిర్ణయం తీసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఖచ్చితంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వీఆర్ఎస్ వెనక అధికార పార్టీ ఉందనే ప్రచారం జరుగుతోంది. రెండేళ్ళ తరువాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఆలంపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం లేకపోలేదని అంటున్నారు విశ్లేషకులు.

  • బీఎస్పీలోకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

    స్వచ్చంద పదవీ విరమణ చేసిన ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరబోతున్నారు. నల…
Load More Related Articles
Load More By admin
Load More In తెలంగాణ

Leave a Reply

Your email address will not be published.