పెగాసుస్ దేశద్రోహమే..-విచారణకు ఆదేశిస్తారా..?

‘పెగాసుస్’ వ్యవహారం దేశవ్యాప్త చర్చకు దారితీసింది. ఈ నిఘా వ్యవహారం సంచలనంగా మారింది. అయితే ఇది ఎవరి పని..?ఎందుకు ఇలా చేశారు..?అన్నది బిగ్ డిబేట్ గా మారింది. కేంద్రమే ఈ దుశ్చర్యకు పాల్పడిందని…ప్రతిపక్ష, బీజేపీ అసంతృప్తవాదుల గొంతు నోక్కేసేందుకు ఈ నిఘా ఉంచినట్లు ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో ఢిల్లీ పెద్దలు మాత్రం..కాముష్ గా ఉండటం పలు అనుమానాలు తావిస్తోంది. దేశ అంతర్గత బద్రతకు సంబంధించిన వ్యవహారంలో చొరబడటం ముమ్మాటికీ రాజ ద్రోహమే అవుతుంది..అయితే ఇది ఎవరు చేశారన్నది చర్చనీయంశంగా మారింది.

పెగాసుస్ సాఫ్ట్‌వేర్ ద్వారా విచ్చలవిడిగా సాగిన నిఘా వ్యవహారం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ నుంచి ఎన్నికల వ్యుహకర్త ప్రశాంత్ కిషోర్ పై నిఘా పెట్టగలిగారు. చాలా వరకు రహస్యాలను తెలుగుకోగాలిగారు. ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో దేశంలో వ్యక్తిగత స్వేఛ్చ లేకుండా పోయిందని అర్థం అవుతోంది. ఈ రహస్యాలను తెలుసుకోవడం పెగాసుస్ తో జరిగింది. దీనిపై సమాధానం చెప్పాలని ప్రతిపక్షాలు నిలదీస్తే కేంద్రం ఈ విషయాన్నీ వదిలేసి…మ్యాటర్ ను డైవర్ట్ చేసేలా ఎదురు దాడికి దుగుతోంది. పెగాసుస్ వ్యవహారంపై క్లారిటీ ఇవ్వడంలేదు. అంత బాగానే ఉందంటూ తన బాధ్యతను విస్మరిస్తోంది కేంద్రం. దేశంలోని పౌరులపై నిఘా ఉందని గగ్గోలు పెడుతుంటే..జాతీయావాదం అని మాట్లాడే కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఈ విషయంలో మౌనంగా ఉండటంపై సాధారణంగానే అనుమానాలు బలపడుతున్నాయి.

ఈ పెగాసుస్ ను ఉగ్రవాదులపై నిఘా పెట్టడానికి మాత్రమే ప్రభుత్వాలకు పర్మిషన్ ఇస్తామని ఇజ్రాయెల్ చెబుతోంది. కాని ఇండియాలో మాత్రం అధికార మార్పిడికి వినియోగిస్తునన్నట్లు ఉందని అంటున్నారు బీజేపీయేతర పక్షాలు. రాజకీయ ప్రత్యర్దుల నుంచి జర్నలిస్టుల వ్యక్తిగత వివరాలను సేకరించారు. దీంతో సాధారణ మానవుడి ఫోన్ కూడా ట్యాప్ అయిందనే అనుమానాలు కల్గుతున్నాయి. ఇలాంటి సమయంలో కేంద్రం బాధ్యత తీసుకొని….ఈ అంశంపై స్పందించి అనుమానాలను నివృత్తి చేయల్సింది కాని…కేంద్రం మాత్రం మౌనంగా ఉంటోంది. ఒకవేళ కేంద్రమే ఈ అధికార దుర్బినియోగానికి పాల్పడితే ఇంతకన్నా దేశ ద్రోహం మరొకటి ఉండదు. ఈ విషయాన్నీ ప్రతిపక్షాలు కావాలనే రాజకీయం చేస్తున్నాయని కేంద్రం లైట్ తీసుకున్నా…ఇలాంటి నిర్ణయం ఆమోదయోగ్యమైంది కాదు. ఒకవేళ ఇతరత్రా వ్యక్తులు , సంస్థలు ఈ దుశ్చర్యకు పాల్పడితే వారిని వదిలిపెట్టకూడదు. విచారణ జరిపి..పెగాసుస్ సాఫ్ట్‌వేర్‌ను ఇండియాకు తీసుకు వచ్చినవారు… నిఘా పెట్టి వ్యక్తిగత వివరాలను సేకరించిన వారు.. వ్యక్తిగత స్వేచ్చపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. కాని కేంద్రం మాత్రం మీనమేషాలు లేక్కిస్తోంది. దేశంలో చట్టాలన్నీ పకడ్బందీగా అమలు అవుతున్నాయని…చట్ట విరుద్దంగా ఇలాంటి నిఘా ఉండదని…చెప్తుంది కాని విచారణకు మాత్రం ఆదేశించడం లేదు. కేంద్రం చేస్తున్నా ఇలాంటి వ్యాఖ్యల వలన ప్రజల్లో అనుమానాలు మరింత పెరిగిపోతున్నాయి.

ఇక, ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చి అధికారంలోకి వచ్చిన బీజేపీ…ఈ పెగాసుస్ సాయంతోనేనా..?అని అనుమానాలు కల్గుతున్నాయి. పలువురు కీలక నేతలను తమ వైపు తిప్పుకోవడానికి పెగాసుస్‌తో నిఘాను ఉపయోగించుకున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కర్ణాటకలో ప్రభుత్వం కూల్చివేతలో ఈ నిఘా ఉపయోగిపడినట్లుగా ఇప్పటికే ప్రచారం ఊపందుకుంది. ఇతర పార్టీలోని కీలక నేతలను తమ పార్టీలో చేరేలా…వారి వ్యక్తిగత విషయాలను తెలుసుకొని బ్లాక్ మెయిల్ చేసిందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇదంతా దుష్ప్రచారమే అనుకున్నప్పుడు కేంద్రమే విచారణకు ఆదేశించి తమ సచ్చీలతను నిరూపించుకుంటే మంచిదే కదా…ఒకవేళ వ్యక్తులో, సంస్థలో ఈ నిఘాను ఉంచినట్లు తేలితే వారిపై చర్యలు తీసుకోవచ్చు కదా అనేది జనాల మాట. ఇది ఇండియా ప్రతిష్టకు సంబంధించిన వ్యవహారం.. ఈ పెగాసుస్ వ్యవహారంలో.. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం.. ప్రజల హక్కులను కాలరాయలేదని… నిరూపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేకపోతే.. ఇండియా ఇమేజ్ ప్రపంచంలో దారుణంగా పడిపోతుంది. అదే అసలైన దేశద్రోహం.

Load More Related Articles
Load More By admin
Load More In ఆంధ్రప్రదేశ్

Leave a Reply

Your email address will not be published.