ఫీజులు కట్టలేక.. బీటెక్ చదువుతున్న ఓ దళిత విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. తన చదువు కోసం తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులను చూసి ఆత్మహత్య చేసుకుంది. ‘‘అమ్మా.. నాన్న.. నా వల్ల కాదు.. నేను చదువుకోలేను.. మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేను. నా వల్ల మీరు అప్పులపాలవుతున్నారు”అంటూ కన్నీళ్లతో సెల్ఫీ వీడియో తీసుకుని సూసైడ్ చేసుకుంది.
వనపర్తి జిల్లాలో నిరుద్యోగి కొండల్ ఆత్మహత్య ఘటన మరవకముందే మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కళాశాల ఫీజ్ కట్టేందుకు పేరెంట్స్ ఆర్ధిక పరిస్థితి కూడా బాగాలేదని సేల్ఫీ వీడియో తీసుకొని తనువు చాలించింది. వనపర్తి జిల్లా కేంద్రంలోని గాంధీ నగర్ కు చెందిన వెంకటయ్య, ఈశ్వరమ్మల కూతురు లావణ్య…. సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ కాలేజ్ లో బీటెక్ సెకండియర్ చదువుతోంది లావణ్య. అయితే..పరీక్షలు రాయాలంటే కాలేజ్ యాజమాన్యం పరీక్ష ఫీజ్ చెల్లించాలని మెలిక పెట్టడంతో..ఫీజ్ కట్టాలని లావణ్య తన తల్లిదండ్రులను కోరింది. వాళ్ళను, వీళ్ళను అడిగినా పరీక్ష ఫీజ్ కు సరిపోయెంత డబ్బు ఆ కుటుంబానికి లభ్యం కాలేదు. దీంతో కుటుంబ ఆర్థిక బాగోలేనందున…నా చదువు కుటుంబానికి భారం కాకూడని ఈ నిర్ణయం తీసుకుంటున్నానని తెలిపింది లావణ్య. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు.