రాజకీయాల్లోకి ఆర్ఎస్-చేరేది ఈ పార్టీలోనే..?

స్వచంద పరవీ విరమణ చేసిన ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి వస్తానని..కాని ఇప్పుడే కాదని వ్యాఖ్యానించడంతో ఆయన ఎ పార్టీలో చేరుతారని అంత చెవులు కొరుక్కుంటున్నారు. తన ఐడియాలజీకి అనుగుణంగా కొత్త పార్టీని ఏర్పాటు చేస్తారా..?లేక ఇప్పటికే ఉన్న ఏదైనా పార్టీలో చేరుతారా..?అన్నది బిగ్ డిబేట్ గా మారింది.

రాజకీయాల్లోకి వస్తా..కాని ఇప్పుడు కాదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. దీంతో ఆయన ఏ పార్టీలో చేరుతారని పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. తన సిద్దాంతాలకు అనుగుణంగా ఉన్న పార్టీలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేరుతారనే ప్రచారం జరుగుతోంది. బహుజన సమాజ్ పార్టీ తో కలిసి సాగేందుకు ఆయన రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. తన రాజీనామా లేఖలో అంబేద్కర్, కాన్షీరాం మార్గదర్శకంలో ఇక నుంచి నడుస్తానని చెప్పిన ఆయన…తనకు బీఎస్పీ అయితే సెట్ అవుతుందనే భావనలో ఉన్నారని ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే తెలంగాణలో బీఎస్పీ ఎక్కడ పోటీ చేసినా 2 శాతం ఓట్లు పడుతున్నాయి. ఈ విష‌యాన్ని గుర్తించిన ప్రవీణ్ కుమార్ రాష్ట్రంలో ఆ పార్టీకి తాను ప్రాతినిధ్యం వ‌హిస్తే మ‌రింత బ‌లం రావొచ్చని.. ఆపై చక్రం తిప్పొచ్చని అంచనా వేస్తున్నారు.తెలంగాణలో కీలకంగా ఉన్న ఎదో పార్టీలో చేరితే ఎలా ఉంటుందని ఆలోచించిన ప్రవీణ్ కుమార్…కాని అవేవీ తన సిద్దాంతాలకు అనుగుణంగా లేకపోవడంతో బీఎస్పీని ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ తో తాను అనుకున్న మార్పులు సాధ్యం కాదని..బీజేపీతో కూడా ఇదివరకు విబేధాలు ఉన్న రీత్యా బహుజన సమాజ్ పార్టీలో చేరాలనే ఆలోచనలో ఉనట్లు చెప్తున్నారు. ఈ క్రమంలోనే బహుజన గొంతుకగా ఉన్న తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళను ఏకం చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భావిస్తున్నారు.

Load More Related Articles
Load More By admin
Load More In తెలంగాణ

Leave a Reply

Your email address will not be published.