వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు సీఐడీ గట్టి షాక్ ఇచ్చింది. సిఎం జగన్ బెయిల్ రద్దు కోసం రఘురామ కృష్ణంరాజుతోపాటు, చంద్రబాబు, నారా లోకేష్, ఓ రెండు ప్రముఖ చానెళ్ళు కుట్ర చేశాయని…సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ఆఫిడవిట్ లో పేర్కొంది సీఐడీ. చంద్రబాబు, లోకేష్ తోపాటు రెండు చానెళ్ళ సూచనల మేరకు రఘురామ నడుస్తున్నారని సీఐడీ ఆరోపించింది.
రఘురామ కేసులో సీఐడీ దూకుడు పెంచింది. సుప్రీంకోర్టులో సంచలన విషయాలతో కూడిన ఆఫిడవిట్ ను దాఖలు చేసింది సిఐడీ. జగన్ బెయిల్ రద్దు కోసం రఘురామ-చంద్రబాబు వాట్సాప్ చాటింగ్ చేసుకున్నట్లు ఆఫిడవిట్ లో పొండుపరిచింది. తమ దర్యాప్తులో ఉన్న రఘురామ కాల్ డేటాను విశ్లేషించగా …కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయని పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఆధారాలను సుప్రీంకోర్టుకు సమర్పించామని తెలిపింది సిఐడీ. దీంతో ఈ అంశాలు రఘురామపై రాజద్రోహం కేసులో చాలా కీలకంగా మారే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.