తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే ప్రగతి భవన్ కు గుడ్ బై చెప్పేయనున్నారా…?తనకు అనుకూలంగా నిర్మించుకున్న ప్రగతి భవన్ ను కేసీఆర్ ఖాళీ చేయడం నమ్మశక్యంగా లేకపోయినా…తాజా పరిణామాలను చూస్తుంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన కొన్నాళ్ళకు కేసీఆర్ పరిపాలనను గడీల పాలన అని ప్రతిపక్షాలు విమర్శించాయి. ఆ తరువాత ప్రగతి భవన్ లో కొన్నిరోజులు, ఫాం హౌస్ లో కొన్ని రోజులు ఉండటంతో ఆయనను ఫాం హౌస్ సిఎం అంటూ విమర్శించారు. ప్రగతి భవన్ లో ఎక్కువ కాలం గడుపుతుండటంతో ఆయనపై విమర్శలు తప్పడం లేదు. జనాల్లోకి ఈ విషయం ప్రతిపక్షాలు బాగా తీసుకెళ్ళడంతో ప్రజల్లో కూడా ఇదే రకమైన భావన కల్గుతోంది. దీంతో ముందస్తు జగ్రత్తలకు కేసీఆర్ ఉపక్రమించినట్లుగా తెలుస్తోంది. రాజకీయ ప్రమాదాలను ముందుగానే అంచనా వేసే కేసీఆర్ ఇప్పుడు ప్రగతి భవన్ ను వదిలేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో ఆయన హైదరాబాద్‌లోని నందినగర్‌లోని తన సొంత ఇంటికి మకాం మార్చాలని అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇటీవలే కుటుంబ సభ్యులతో కలిసి పాత ఇంటికి వెళ్ళినా కేసీఆర్..అక్కడ ఉండేందుకు తనకు అనువుగా మార్పులు, చేర్పులు చేయాలనీ సూచించినట్టుగా చెప్తున్నారు. దీనికి తోడు రేవంత్ , బండి సంజయ్ లు మంచి దూకుడు మీద ఉండటం కేసీఆర్ ను ఇబ్బందికి గురి చేస్తోంది. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ పోటాపోటీగా ప్రభుత్వ నిర్ణయాలపై నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తూ ఉండటంతో ప్రభుత్వాధినేతపై క్రమంగా ఒత్తిడి పెరుగుతోంది. దీంతో ప్రగతి భవన్ ను వదిలేస్తేనే ఉత్తమమనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వాస్తు నిపుణులు కూడా ఇదే విషయాన్నీ కేసీఆర్ కు చేరవేసినట్లు సమాచారం. దీంతో ప్రగతి భవన్ నుంచి మకాం మార్చాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది . చూడాలి మరి ఏం జరుగుతుందో.