టీ.టీడీపీ అధ్యక్షుడిగా బక్కని నర్సింహులు

టీ. టీడీపీ అధ్యక్షుడిగా బక్కని నర్సింహులును పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. ఇంతకాలం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఎల్.రమణ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో ఆయన స్థానంలో నర్సింహులును చంద్రబాబు నియమించారు.

టీవీ6 ముందే చెప్పింది…టీ. టీడీపీలో సీనియర్ గా ఉన్న రావుల చంద్రశేఖర్ రెడ్డి కాకపోతే..బక్కని నర్సింహులుకు అద్యక్ష బాధ్యతలను అప్పగిస్తారని తెలిపింది. దీంతో టీవీ6 చెప్పినట్టుగానే అద్యక్ష బాధ్యతల స్వీకరణకు రావుల ఆసక్తి చూపకపోవడంతో బక్కని నర్సింహులును అద్యక్షుడిగా నియమిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపికైన సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను బక్కని నర్సింహులు మద్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బక్కనిని లోకేశ్ అభినందించారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజల పక్షాల నిలబడి పోరాటం చేయాలని అన్నారు. దళిత సామాజికవర్గానికి చెందిన బక్కని నర్సింహులు 1994-99 మధ్య కాలంలో షాద్ నగర్ ఎమ్మెల్యేగా బాధ్యతలను నిర్వహించారు.

Load More Related Articles
Load More By admin
Load More In తెలంగాణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *