కర్నూల్ జిల్లా ఆదోని పట్టణంలో నడిబొడ్డున ఉన్న గ్రంథాలయ భవనం శిథిలావస్థకు చేరుకొని ప్రమాదభరితంగా మారించి. అయినా మున్సిపల్ అధికారులు మాత్రం అటు వైపు కన్నెత్తి చూడటం లేదు. అసలే వానాకాలం కావడం…భవనం శిథిలావస్థకు చేరడంతో స్థానికులు ఈ భవనం ఎప్పుడు కులుతుందోనని టెన్షన్ పడుతున్నారు.
ఆదోని పట్టణంలోని రీడింగ్ భవనం శిథిలావస్థకు చేరుకొని ప్రమాదకరంగా మారింది. కొత్త బస్టాండ్ మెయిన్ రోడ్ లో 21 వార్డు ఎంఎం కాలనీలో 1963లో ఆదోని మున్సిపల్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల కోసం ఈ భవనాన్ని నిర్మించారు. అయితే నేటికీ 58 సంవత్సరాలు అవుతున్న నిరుపయోగంగానే ఈ భవనం దర్శనమిస్తున్న అధికారులు మాత్రం ఈ గ్రంథాలయం వైపు దృష్టి సారించడం లేదు. ఈ గ్రంథాలయంలో ఎంతోమంది విజ్ఞానాన్ని సంపాదించుకుని ఉన్నత చదువులు చదివి, ఉన్నత ఉద్యోగాల్లో పనిచేస్తున్నారు. అప్పటి ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల పిల్లల కోసం ఇదే గ్రంథాలయం పక్కన పిల్లల కోసం పార్కును కూడా ఏర్పాటు చేసింది. కాలక్రమేణా భవనం పార్కు నిరుపయోగంగా మారిపోయిందన్నారు ఏఐటియుసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అజయ్ బాబు. ఈ గ్రంథాలయ విషయమై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్ళామని… అధికారులు మారుతున్నారు తప్ప ఈ గ్రంధాలయం భవన రూపురేఖలు మాత్రం మారడం లేదంటూ విచారం వ్యక్తం చేశారు. ఇకనైనా మున్సిపల్ అధికారులు ఇలాంటి ప్రభుత్వ భవనాలు ఎన్నో ఆదోని పట్టణంలో నిరుపయోగంగా ఉన్నాయని వాటిపై ఫోకస్ పెట్టాలని సూచించారు.