తెలంగాణ ధనిక రాష్ట్రమని చెప్పుకుంటున్న సీఎం కేసీఆర్… ప్రభుత్వ భూములను ఎందుకు విక్రయిస్తున్నారని ప్రశ్నించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. రానున్న రోజుల్లో ప్రభుత్వ అవసరాలకు భూములు కావాలంటే ఏం చేస్తారని నిలదీశారు. భవిష్యత్తు అవసరాలను అంచనా వేయకుండా రాష్ట్ర సంపదను తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కేసీఆర్ అమ్ముకుంటున్నారని… పరిస్థితి ఇలాగే కొనసాగితే చివరకు శ్మశానాలకు కూడా స్థలం దొరకని పరిస్థితులు నెలకొంటాయని మండిపడ్డారు. కోకాపేట భూముల వేలం వల్ల రూ. 2 వేల కోట్లు వచ్చాయని హెచ్ఎండీఏ తెలిపిందని…. అయితే ఆన్ లైన్ వేలంలో పాలకవర్గం బినామీలే పాల్గొన్నారని రేవంత్ ఆరోపించారు. కేసీఆర్ బినామీ సంస్థలే వేలంలో పాల్గొన్నాయని అన్నారు. ఆన్ లైన్ ద్వారా జరిగే వేలంలో ఎన్నో అంతర్జాతీయ సంస్థలు పాల్గొంటాయని.. తర్వారా ఆ సంస్థలు పరిశ్రమలను నెలకొల్పుతాయని చెప్పారు. వేలంలో పాల్గొనవద్దని పలువురిని బెదిరించారని రేవంత్ అన్నారు. ఐదు కంపెనీలు కలిసి రూ. వెయ్యి కోట్ల ప్రజా ధనాన్ని కొల్లగొట్టాయని మండిపడ్డారు.
Load More Related Articles
-
ఇటు మోడీ… అటు కేసీఆర్
ప్రధానమంత్రి హైదరాబాద్ వస్తుంటే తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం పక్క రాష్ట్ర పర్యటనకు వెళ్ళారు… -
ప్రారంభమైన బస్సు యాత్ర – మంత్రుల స్పందన
సామాజిక న్యాయానికి ఏపీ నాంది పలికింది ఆ దిశగా దేశంలో మార్పునకు సీఎం జగన్ ఆద్యుడయ్యారు బలహీ… -
బెంగళూర్ లో కేసీఆర్ ఫ్లెక్సి
ముఖ్యమంత్రి కేసీఆర్… నేడు బెంగళూరు వెళ్ళారు. మాజీ ప్రధానమంత్రి దేవెగౌడతో పాటు కర్ణాటక మాజీ…
Load More By admin
-
ఇటు మోడీ… అటు కేసీఆర్
ప్రధానమంత్రి హైదరాబాద్ వస్తుంటే తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం పక్క రాష్ట్ర పర్యటనకు వెళ్ళారు… -
బెంగళూర్ లో కేసీఆర్ ఫ్లెక్సి
ముఖ్యమంత్రి కేసీఆర్… నేడు బెంగళూరు వెళ్ళారు. మాజీ ప్రధానమంత్రి దేవెగౌడతో పాటు కర్ణాటక మాజీ… -
మళ్ళీ ఒకటిగా పవన్ , రేణు దేశాయ్
రేణు దేశాయ్ తో విడాకుల తీసుకున్న తరువాత మొదటిసారి పవన్ కళ్యాణ్ , రేణు లు ఒకే ఫ్రేం లో కనిప…
Load More In తెలంగాణ
Click To Comment