జగన్ బెయిల్ రద్దు కావొద్దంటోన్న నారాయణ

ఏపీ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు చేయాలనీ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రఘురామ పిటిషన్ దాఖలు చేయడం ముమ్మాటికీ తప్పేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ బెయిలు రద్దు అవుతుందో, లేదో తెలియదు కానీ రఘురామరాజు పార్లమెంటు సభ్యత్వం మాత్రం రద్దవుతుందని జోస్యం చెప్పారు. రఘురామ కోసం ఏపీలో బలమైన వైసీపీని బీజేపీ వదులుకోదని నారాయణ అన్నారు. రఘురామరాజు కోరుకున్నట్టు బెయిలు రద్దయి జైలుకు వెళ్లినా జగన్‌కు వచ్చే నష్టం ఏమీ ఉండదన్నారు. గతంలో 16 నెలలు జైలులో ఉన్న జగన్ ఆ సానుభూతితో ఎన్నికల్లో గెలిచారని, మరోసారి జైలుకు వెళ్తే ఆయన మరోసారి సెంటి మెంట్ తో అధికారంలోకి రావడం ఖాయమని నారాయణ వ్యాఖ్యానించారు.

Load More Related Articles
Load More By admin
Load More In ఆంధ్రప్రదేశ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *