మీకు ఏమైనా సిగ్గుందా-జీహెచ్ఎంసీ పై హైకోర్టు ఆగ్రహం

హైద‌రాబాద్‌లో రోడ్ల దుస్థితిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జీహెచ్ఎంసీ అధికారుల‌కు బాగానే వాతలు పెట్టింది. న‌గ‌రంలోని ర‌హ‌దారుల‌పై ప‌డిన‌ గుంతలను ఒక వృద్ధ దంపతులు పూడ్చుతోంటే సిగ్గుగా అనిపించ‌డం లేదా నిల‌దీసింది. గుంతలను మూసివేయడానికి ఆ రిటైర్డ్ ఉద్యోగి దంప‌తులు తమ‌ పెన్షన్ మొత్తాన్ని ఖర్చు చేస్తోంటే.. జీహెచ్ఎంసీ ఏం చేస్తోంద‌ని నిలదీసింది.

నగరంలో రహదారుల దుస్థితిపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఓ వృద్ద జంట ఏర్పడిన గుంతలను పూడ్చుతుంటే జీహెచ్ఎంసి ఎం చేస్తోందని ప్రశ్నించింది. గంగాధర్ తిలక్ అనే రిటైర్డ్ ఉద్యోగి కుమారుడు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అప్పటి నుంచి మరెవరికీ ఇలాంటి దుస్థితి తలేత్తోందని భావించి ఎక్కడా రోడ్లపై గుంతలు కనిపించినా పూడుస్తుంటారు తిలక్ దంపతులు. పెన్షన్ డబ్బుతో ఆ గుంతలను స్వచ్చందంగా పూడుస్తున్నారు. వీరు చేస్తున్న ప‌ని హైకోర్టు దృష్టికి వెళ్లడంతో.. జీహెచ్ఎంసీ ప‌ని తీరుపై అస‌హ‌నం వెళ్లగ‌క్కింది. జీహెచ్‌ఎంసీ అధికారుల వేతనాలను తిలక్‌ దంపతులకు ఇవ్వడం మేలని అభిప్రాయపడింది. రోడ్లపై సాధార‌ణ పౌరులు స్పందించేవ‌ర‌కూ జీహెచ్‌ఎంసీ అధికారులు ఏం చేస్తున్నార‌ని.. సిబ్బంది ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మండిప‌డింది. ఒక‌వేళ న‌గరంలో ఎలాంటి గుంత‌లు లేవ‌ని జీహెచ్ఎంసీ అనుకుంటే… త‌మ‌ న్యాయవాదుల బృందం తనిఖీ చేసి నివేదిస్తుందని కోర్టు తెలిపింది. రహదారుల మరమ్మతుపై జోనల్ వారీగా నివేదికలు ఇవ్వాలని, నగరంలో వర్షాల కార‌ణంగా ఎదుర‌య్యే బాధలను పరిష్కరించాలని కోర్టు ఆదేశించింది.

Load More Related Articles
Load More By admin
Load More In తెలంగాణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *