ఇటీవలి కేంద్రమంత్రివర్గ విస్తరణలో చోటు కోల్పోయిన రవిశంకర్ ప్రసాద్ తమిళనాడు కొత్త గవర్నర్ గా నియమితులయ్యారు. మొన్నటి వరకు కేంద్రన్యాయ శాఖ మంత్రిగా పని చేసిన ఆయన…మంత్రివర్గ విస్తరణలో తన పదవికి రాజీనామా చేశారు. తాజాగా ఆయనను తమిళనాడు గవర్నర్ గా నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
తమిళనాడు కొత్త గవర్నర్‌గా కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ నియమితులయ్యారు. మోడీ కేబినేట్ లో న్యాయశాఖ మంత్రిగా పని చేసిన ఆయన…ఇటీవల మంత్రివర్గ విస్తరణ సమయంలో తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుత తమిళనాడు గవర్నర్ గా కొనసాగుతోన్న భన్వర్‌లాల్ పురోహిత్ స్థానంలో తాజాగా రవిశంకర్ ప్రసాద్ ను కొత్త గవర్నర్ గా నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కేంద్ర మంత్రి వర్గ విస్తరణకు ముందు రోజే 8 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది కేంద్రం. అప్పటిదాకా కేంద్రమంత్రిగా ఉన్న థావర్ చంద్ గెహ్లాట్‌ను కర్నాటక గవర్నర్ పంపింది. ఏపీ బీజేపీ నేత హరిబాబును మిజోరం గవర్నర్‌గా నియమించింది. ఇక హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయను.. హర్యానాకు పంపింది. మరోవైపు…ఇటీవల మంత్రివర్గంలో చోటు కోల్పోయిన ఇంకొంతమందిని కూడా కేంద్రం గవర్నర్ లు గా నియమించే అవకాశం కనిపిస్తోంది.