టి. టీడీపీకి కొత్త బాస్ ఎవరు-అధినేత మనస్సులో ఎవరున్నారు…?

తెలంగాణలో టీడీపీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నా ఈ సమయంలో అద్యక్ష పదవితోపాటు, పార్టీకి ఎల్ రమణ రాజీనామా చేయడంతో కొత్త సారధిగా ఎవర్ని నియమిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. పార్టీకి, అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితులుగా ఉన్న వారు కూడా పార్టీని ఒక్కొక్కరుగా వీడుతు ఉండటంతో…ఎవరికీ అద్యక్ష పదవిని కట్టబెట్టాలనే విషయంపై అధిష్టానం తర్జన భర్జన పడుతోంది.

రాష్ట్ర అధ్యక్షుడే పార్టీని వీడటం పార్టీ ఎదుగుదలకు మంచిది కాదని..భవిష్యత్ లో మరోసారి ఇలాంటి పరిస్థితులు పునరావృత్తం కాకుండా ఉండేందుకు ఆ పదవిలో నియమించాలని చంద్రబాబు కసరత్తు ప్రారంభించారు. సీనియర్ నేతల గురించి క్షున్నంగా ఆరాతీసి…పార్టీకి లాయల్ లుగా ఉండే వారి పేర్లను సిద్దం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కొందరి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. టి. టీడీపీకి అద్యక్ష పదవి కోసం ప్రధానంగా రావుల చంద్రశేఖర్ రెడ్డి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు, పార్టీలో సీనియర్ నేత కావడంతో ఆయన పేరు ఎక్కువగా వినిపిస్తోంది. నెక్స్ట్ ఫైర్ బ్రాండ్ నన్నూరి నర్సిరెడ్డి పేరు కూడా చర్చకు వస్తోంది. టీఆర్ఎస్ సర్కార్ తీసుకుంటున్నా ప్రజా వ్యతిరేక నిర్ణయాలను జనాలకు బాగా వివరించగలుగుతారనే పాయింట్ లో ఆయన పేరు కూడా వినిపిస్తోంది. ఇక, పార్టీ జాతీయ క్రమశిక్షణ సంఘం సభ్యుడు మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింలుతో పాటు సీనియర్‌ నేతలు అరవిందకుమార్‌ గౌడ్‌, కొత్తకోట దయాకర్‌రెడ్డి వంటి పేర్లను కూడా టీడీపీ అధిష్టానం ప‌రిశీలిస్తోంది. ఇదివరకు బీసీకి అద్యక్ష పదవి ఇవ్వడంతో ఈసారి ఎస్సీలకు ఇవ్వాలని భావిస్తే సామజిక సమీకరలతో ఆ పదవి బక్కని నర్సింహులుకు ఇచే అవకాశం ఉంది. అయితే పార్టీలో బ‌లంగా త‌యారైన వ్యక్తులే.. మ‌ధ్యలో విడిచిపెడుతుండ‌టం క‌ల‌వ‌ర‌పెడుతోంది.

Load More Related Articles
Load More By admin
Load More In తెలంగాణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *