ఏపీ ప్రభుత్వ ఖజానా నుంచి 41,043 కోట్లకు సంబంధించిన వివరాలు లేవని పీఏసీ చైర్మన్ పయ్యల కేశవ్ గవర్నర్ కు రాసిన లేఖతో కలకలం రేగింది. ఆ నిధులు ఏమైయ్యాయని ఏపీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో విషయం కాస్తా కేంద్రానికి చేరడంతో తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ స్పందించి జగన్ సర్కార్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ప్రభుత్వ ఖజానా నుంచి 41,043 కోట్లకు సంబందించిన ఖర్చుల వివరాలు లేవంటూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు ఏపీ ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ లేఖ రాశారు. ఆ నిధులకు సంబంధించి ఎలాంటి గోల్మాల్ జరగలేదని, ఆ మొత్తాన్ని బడ్జెట్ ఖాతా నుంచి వివిధ కార్పొరేషన్ల పీడీ ఖాతాలకు మళ్లించి ఖర్చు చేసినట్టు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ వివరణ ఇచ్చారు. దీనిపై ఇప్పటికే రాష్ట్ర ముఖ్య కార్యదర్శి స్పందించి క్లారిటీ ఇవ్వగా తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ స్పందించి జగన్ సర్కార్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం రుణపరిమితికి మించి డబ్బులు వాడేసుకున్నదని కేంద్రం స్పష్టం చేసింది. అంతేకాదు.. ఎఫ్ఆర్బీఎం పరిమితి దాటి రూ.17 వేల కోట్లు అదనంగా వాడుకున్నట్లు కూడా ఏపీ ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి కేంద్ర ఆర్థికశాఖ లేఖ ద్వారా తెలిపింది. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాసిన లేఖను పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ విడుదల చేశారు. లేఖలో ఏపీ ప్రభుత్వాన్ని కేంద్రం గట్టిగా హెచ్చరించింది. అదనంగా వాడుకున్న 17వేల కోట్లను ఈ ఆర్థిక సంవత్సరంలో సర్దుబాటు చేస్తామని కేంద్రం తెలిపింది. ఎఫ్ఆర్బీఎం పరిధి దాటి అదనంగా అప్పు తేవడం చట్టవిరుద్ధమని ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని కేంద్రం తప్పుబట్టింది. తాము పంపిన లెక్కల్లో తేడాలుంటే తెలియజేయాలని ఏపీని కేంద్రం ఆదేశించింది.
-
త్రివిక్రమ్ మూవీలో మహేశ్ ద్విపాత్రాభినయం!
మొదటి నుంచి కూడా మహేశ్ బాబుకి ఒక అలవాటు ఉంది. తనకి హిట్ ఇచ్చిన దర్శకులతో మళ్లీ మళ్లీ కలిసి… -
యువరాజ్ సింగ్ కొడుకు పేరు ఏమిటో తెలుసా?
టీమిండియా మాజీ స్టార్ బ్యాట్స్ మెన్ యువరాజ్ సింగ్ సినీనటి, మోడల్ హాజెల్ కీచ్ ను పెళ్లాడిన … -
విద్యార్థుల సమస్యలు కేసీఆర్ కు పట్టవా?: బండి సంజయ్
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్…
Load More Related Articles

Load More By admin
-
త్రివిక్రమ్ మూవీలో మహేశ్ ద్విపాత్రాభినయం!
మొదటి నుంచి కూడా మహేశ్ బాబుకి ఒక అలవాటు ఉంది. తనకి హిట్ ఇచ్చిన దర్శకులతో మళ్లీ మళ్లీ కలిసి… -
నేడు భారత్ బంద్.. అప్రమత్తమైన పలు రాష్ట్రాలు
అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలుపెద్ద ఎత్తున పోలీసు బలగాల మోహరింపువిద్యా… -
రైతులకు భరోసా ఇవ్వడంలో ప్రభుత్వం విఫలం
రైతులకు భరోసా ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని జనసేన నేత మనోహర్ తప్పుబట్టారు. రైతు భరోసాకు క…
Load More In ఆంధ్రప్రదేశ్
Click To Comment