దేశ వ్యాప్తంగా ప్రభుత్వాలు కరోనా ఆంక్షలను ఎత్తివేస్తూ అన్ని రంగాల వారికీ అనుమతులు ఇస్తున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా థియేటర్లు తెరిచేందుకు తాజాగా అనుమతిచ్చింది.
కరోనా సెకెండ్ వేవ్ కారణంగా మూడు నెలలుగా థియేటర్లను మూసివేయడంతో సినిమా రంగం అండ్ థియేటర్ల పై ఆధారపడుతున్న లక్షల మంది నానా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ప్రభుత్వం థియేటర్ల పై ఆంక్షలను సడలించే సరికి సినిమా వాళ్ళలో కొత్త ఉత్సాహం వచ్చింది. ఇప్పటికిప్పుడు సినిమాలను రిలీజ్ చేయకపోయినా వచ్చే నెలలో వరుసగా రిలీజ్ చేయనున్నారు. మొత్తానికి ఆంధ్ర రాష్ట్రంలో కూడా కరోనా పాజిటివ్ కేసులు తగ్గడంతో జగన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది. ఐతే, సీటుకు, సీటుకు మధ్య గ్యాప్ ఉండేలా చూడాలని జగన్ ప్రభుత్వం కఠిన నిబంధన పెట్టింది. మరి 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ ను నడిపితే ఎంతవరకు గిట్టుబాటు అవుతుంది అనేది మిలియన్ల డాలర్ల ప్రశ్నయే