గాంధీ భవన్ కు వాస్తు దోషమా -రూపురేఖలు మారుతాయా..?

రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పోస్ట్ ఇచ్చాక కాంగ్రెస్ లో జోష్ నెలకొంది. ఇప్పుడు రేవంత్ ముందు అనేక సవాళ్ళు ఉన్నాయి. పార్టీని బలోపేతం చేయడంతోపాటు..కాంగ్రెస్ ను ఆధికారంలోకి తీసుకురావడం. వీటన్నింటిపై వ్యూహం ప్రకారం ముందుకు వెళ్తోన్న రేవంత్….ఇప్పుడు పార్టీ కార్యాలయమైన గాంధీ భవన్ రూపు రేఖలపై కూడా ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది.

ఈనెల 7న పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టనున్నారు రేవంత్ రెడ్డి. ఈ క్రమంలో గాంధీ భవన్ లో కొన్ని మార్పులు జరుగుతున్నాయి. వాస్తు నిపుణులు, వేద పండితుల పరిశీలనలో ఈ మార్పులు చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది. గాంధీభవన్ ఎంట్రీ పాయింట్ దగ్గర నుంచి చాలా ఛేంజెస్ జరుగుతున్నట్లు సమాచారం. రేవంత్ టీమ్.. గాంధీ భవన్ క్యాంటిన్ దగ్గర ఉన్న పాత గేట్ నుండి ఎంట్రీ ఇచ్చి.. కొత్త గేటు నుంచి బయటకు వెళ్లేలా ప్లాన్ చేశారు. ఇక గాంధీ భవన్‌ లోపల కూడా కొన్ని మార్పులు చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. సెక్యూరిటీ, పార్టీ జెండాలు అమ్మే రూమ్స్ ను తొలగించాలని నిర్ణయించారట. అలాగే తూర్పు ఈశాన్యం వైపు ఎలాంటి బరువు లేకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆవరణలో ఒక్క గాంధీ విగ్రహం మాత్రమే ఉండేలా.. ఇంకెలాంటి నిర్మాణాలు లేకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయని పార్టీ శ్రేణుల నుంచి వస్తున్న సమాచారం.

Load More Related Articles
Load More By admin
Load More In తెలంగాణ

Leave a Reply

Your email address will not be published.