హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ దళిత్ కార్డ్ అప్లై…?

హుజురాబాద్ ఉప ఎన్నికలో గెలిచేందుకు అన్ని ప్రయ‌త్నాలు చేస్తున్న టీఆర్ఎస్.. వాట‌న్నింటికంటే కూడా అభ్యర్థి ఎంపికలో ఇంకా ఓ క్లారిటీకి రావడం లేదు. హుజురాబాద్‌ను ఎలా సొంతం చేసుకోవాలా అని లెక్కలు కడుతోంది. అయితే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మ‌న‌సులో మాత్రం ద‌ళిత అస్త్రాన్నే ప్రయోగించాల‌ని ఉన్నట్టుగా తెలుస్తోంది.

టీఆర్ఎస్ నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బీసీ నేత ఈట‌ల ముందు ఎవ‌రిని నిల‌బెట్టినా తేలిపోయేలా ఉండ‌టంతో.. ద‌ళిత సామాజిక వ‌ర్గానికి చెందిన అభ్యర్థిని రంగంలోకి దింపే యోచ‌న‌లో కేసీఆర్ ఉన్నార‌ని చ‌ర్చ న‌డుస్తోంది. అలా టీఆర్ఎస్ అభ్యర్థి రేసులో కొత్తగా ఇప్పుడు క‌డియం శ్రీహ‌రి పేరు గ‌ట్టిగా వినిపిస్తోంది. హుజురాబాద్ నుంచి కడియం శ్రీహ‌రిని పోటీ చేయిస్తే ఎలా ఉంటుంద‌న్న విష‌యంపై కేసీఆర్ కొంద‌రు ముఖ్య నేత‌ల‌తో చ‌ర్చలు జ‌రుపుతున్నార‌ని తెలుస్తోంది. ఇటీవ‌ల ద‌ళిత సాధికార‌త పేరుతో తాము ప్రక‌టించిన వ‌రాల‌కు తోడుగా.. అదే సామాజిక‌ వ‌ర్గానికి చెందిన క‌డియంను పోటీలో నిల‌బెడితే లెక్క సరిపోతుంద‌ని కేసీఆర్ వారితో అన్నార‌ట‌. ఈట‌ల వెళ్లిపోయినా.. టీఆర్ఎస్‌కు హుజురాబాద్‌లో టీఆర్ఎస్‌కు చెప్పుకోద‌గ్గ ఓటు బ్యాంకు ఉంటుందని.. అయితే ఏదో ఒక‌వ‌ర్గం ఓట్లపై గ‌ట్టిగా ఫోక‌స్ చేస్తే అక్కడ గెల‌వ‌డం పెద్ద క‌ష్టమేం కాద‌ని కేసీఆర్ భావిస్తున్నార‌ట‌. ఈ క్రమంలోనే 40 వేల ఓట్లున్న ద‌ళితవ‌ర్గంపై కేసీఆర్ ఫోక‌స్ పెట్టిన‌ట్టుట‌గా తెలుస్తోంది. ఈ విష‌యం గురించి మాట్లాడేందుకే ఇటీవ‌ల కేసీఆర్ త‌న వ‌రంగ‌ల్ ప‌ర్యట‌న‌లో కడియం ఇంటికి వెళ్లిన‌ట్టుగా ఇప్పుడు రాజకీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. తెలంగాణ తొలి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ప‌నిచేసిన క‌డియం.. రెండోసారి అధికారంలోకి వ‌చ్చాక ప్రాధాన్యం కోల్పోయారు. దీనికి తోడు ఆయ‌న ఎమ్మెల్సీ ప‌ద‌వీ కాలం కూడా పూర్తి కావ‌డంతో ఖాళీగానే ఉండిపోయారు. దీంతో హుజురాబాద్‌లో గెలిచి వ‌స్తే.. ఈట‌ల నుంచి తీసుకున్న మంత్రి ప‌ద‌విని కూడా ఇస్తాన‌ని క‌డియంతో కేసీఆర్ చెప్పిన‌ట్టుగా టాక్ న‌డుస్తోంది. పైగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో స్టేష‌న్ ఘ‌న్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయాల‌ని క‌డియం ప్రయ‌త్నిస్తుండ‌టంతో.. సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం రాజ‌య్య గ‌రం మీద ఉన్నారు. ఈ ఇద్దరి మ‌ధ్య స‌యోధ్య కూడా లేదు. దీంతో క‌డియంను హుజురాబాద్ నుంచి పోటీ చేయిస్తే ఆ స‌మ‌స్య కూడా ప‌రిష్కారం అవుతుంద‌న్నది కేసీఆర్ ఆలోచ‌న‌గా చెప్పుకుంటున్నారు.

Load More Related Articles
Load More By admin
Load More In తెలంగాణ

Leave a Reply

Your email address will not be published.